
Tomato: భారీగా తగ్గిన టమాట ధరలు.. మదనపల్లె మార్కెట్లో ధర ఎంతంటే?
ఈ వార్తాకథనం ఏంటి
గత నెలలో రికార్డు ధర పలికిన టమాట ధరలు క్రమ క్రమంగా దిగివస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె వ్యవసాయ మార్కెట్లో టమాట ధరలు భారీగా పతనమయ్యాయి.
నాలుగు రోజులుగా మార్కెట్‌కు భారీగా టమాటా పంట వస్తుండటంతో ధరలు తగ్గుముఖం పట్టాయి.
మదనపల్లె వ్యవసాయ మార్కెట్లో నిన్న కిలో టమాటా రూ.100 ఉండగా.. ఇవాళ 'ఏ' గ్రేడ్ కిలో రూ.50 నుంచి రూ.64 వరకు పలికాయి. గ్రేడ్ 'బి' రూ. 36 నుంచి రూ. 48 వరకు పలికాయి.
సగటున కిలో టమాటా రూ. 44 నుంచి రూ. 60 మధ్య వ్యాపారులు కొనుగోలు చేస్తున్నట్లు మదనపల్లె మార్కెట్ యార్డు కార్యదర్శి అభిలాష్ తెలిపారు.
Details
సాధారణ స్థితికి టమాటా ధరలు
మదనపల్లె మార్కెట్ చరిత్రలోనే తొలిసారిగా గత నెలలో కిలో టమాటా ధరలు అత్యధికంగా రూ.200 పైగా పలికాయి.
ఇక వినియోగదారుల చేతులోకి వచ్చేసరికి ఆ రేటు ఇంకా భారీగా పెరిగిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల రూ. 250 దాకా పలకడం విశేషం.
ఇటీవల టమాటా ధరలు రూ.200 నుంచి రూ. 100కు పడిపోయిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఈ ధరలు మరింత తగ్గాయి. టమాటా ధరలు సాధారణ స్థితికి చేరుకోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు.