LOADING...
Tomato: పాపం రైతులు.. పడిపోయిన టమాటా ధర.. కిలో ఎంతంటే? 
పాపం రైతులు.. పడిపోయిన టమాటా ధర.. కిలో ఎంతంటే?

Tomato: పాపం రైతులు.. పడిపోయిన టమాటా ధర.. కిలో ఎంతంటే? 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 06, 2025
09:25 am

ఈ వార్తాకథనం ఏంటి

కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్‌లో టమాటా ధరలు ఒక్కసారిగా క్షీణించాయి. పండుగ ముందు వరకు కిలోకు రూ.8 నుండి రూ.10 వరకు అమ్ముడవుతున్న టమాటాలు, ఆదివారం రోజున ఒక్కసారిగా రూ.4 తగ్గిపోయాయని రైతులు తెలిపారు. దీంతో తీవ్ర నిరాశకు గురైన పలువురు కర్షకులు తమ పండును రోడ్డుపై పారబోశారు. అనంతరం ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. ఈ కారణంగా కొంతసేపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

వివరాలు 

టమాటా కిలోకు కేవలం ఒక రూపాయి

రైతులు తమ బాధను వ్యక్తం చేస్తూ, టమాటా పంట విక్రయం ద్వారా వచ్చిన తక్కువ మొత్తంలోనే మార్కెట్‌ కమీషన్‌, కోతకూలీలు, రవాణా ఖర్చులు వంటి వ్యయాలు కూడా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని వేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో టమాటా కిలోకు కేవలం ఒక రూపాయి మాత్రమే రావడం తమకు తీవ్ర నిరాశ కలిగించిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.