Road accident: బ్రిడ్జిపై నుంచి కిందపడిన ట్రావెల్ బస్సు.. 20 మందికి గాయాలు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అనంతపురం జిల్లా పామిడి మండలం పొగురూరు సమీపంలోని నేషనల్ హైవేపై ఆదివారం తెల్లవారుజామున ఈ విషాద ఘటన జరిగింది. బ్రిడ్జిపై నుంచి వెళ్తున్న ట్రావెల్ బస్సును ఐషర్ వాహనం ఢీకొనడంతో బస్సు అదుపుతప్పి బ్రిడ్జిపై నుంచి కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో ట్రావెల్ బస్సులో ప్రయాణిస్తున్న 20 మంది గాయపడినట్లు సమాచారం. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
వివరాలు
సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టి, ప్రమాదానికి సంబంధించిన పరిస్థితులను పరిశీలించారు.
మరోవైపు ప్రమాదం కారణంగా నేషనల్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
దీంతో పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించే చర్యలు చేపట్టారు.