Delhi: దిల్లీలో గ్యాంగ్‌స్టర్ల బెదిరింపులు.. భయాందోళనలో వ్యాపారులు
దిల్లీలోని వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని విదేశీ గ్యాంగ్‌స్టర్లు బెదిరింపు కాల్స్ చేయడం కలకలం రేపుతోంది. 2023 అక్టోబర్ నాటికి 160 బెదిరింపు కాల్స్ వచ్చాయి. బిల్డర్లు, స్థిరాస్తి వ్యాపారులు, నగల వ్యాపారులు, మిఠాయి దుకాణాల యజమానులు, కార్ల షోరూం యజమానులకు ఎక్కువగా బెదిరింపు కాల్స్ రావడం గమనార్హం. మరికొందరి వ్యాపారుల కార్యాలయాలు, ఇళ్లపైనా దుండగులు కాల్పులకు పాల్పడుతుండటంతో వారు భయాందోళనకు గురవుతున్నారని పోలీసులు పేర్కొన్నారు. రోహిణి ప్రాంతంలో ఓ వ్యాపారి ప్రత్యేక షోరూమ్‌లోకి చొరబడి ముగ్గురు దుండగులు గాల్లో కాల్పులు జరిపారు. రూ.10 కోట్లు ఇవ్వాలని రాసి వదిలి వెళ్లాలని నోట్ అక్కడ దొరకడంతో అక్కడివారంతా షాకయ్యారు
ప్రత్యేక క్రైమ్ బ్రాంచ్ లు ఏర్పాటు
నంగ్లోయ్ ప్రాంతంలోని జిమ్ యజమాని నుండి రూ.7 కోట్లు డిమాండ్ చేస్తూ, అంతర్జాతీయ కాల్ నంబర్ నుంచి బెదిరింపు కాల్ వచ్చినట్లు పోలీసులు ధ్రువీకరించారు. దీనిపై గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్, దీపక్ బాక్సర్ వంటి వ్యక్తులు తమ అనుచరులుగా పేర్కొన్నారు. ఈ బెదిరింపులపై చర్యలు తీసుకోవడానికి ప్రత్యేక క్రైమ్ బ్రాంచ్ బృందాలు, ప్రత్యేక సెల్‌లు ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. ఈ బెదిరింపులకు పాల్పడుతున్న 11 ముఠా నేతలను గుర్తించామన్నారు. వాటిలో ముఖ్యమైనవి లారెన్స్ బిష్ణోయ్-గోల్డీ బ్రార్, హిమాన్షు భౌ, కపిల్ సాంగ్వాన్, జితేందర్ గోగి-సంపత్ నెహ్రా, హషీమ్ బాబా, సునీల్ టిల్లు, కౌశల్ చౌదరి, నీరజ్ ఫరీద్‌పూరియా వంటి గ్యాంగ్‌లు ఉన్నాయని పోలీసులు తెలియజేశారు.