తదుపరి వార్తా కథనం

Andhra Pradesh: అనకాపల్లి బాణసంచా కేంద్రంలో విషాదం.. ఎనిమిది మంది దుర్మరణం
వ్రాసిన వారు
Jayachandra Akuri
Apr 13, 2025
03:06 pm
ఈ వార్తాకథనం ఏంటి
కోటవురట్ల మండలంలోని కైలాసపట్నం గ్రామంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. స్థానికంగా ఉన్న బాణసంచా తయారీ కేంద్రంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలవ్వగా, మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
ఘటనాస్థలికి వెంటనే అగ్నిమాపక దళం, పోలీసులు చేరుకొని మంటలను అదుపు చేయడమే కాకుండా సహాయక చర్యలు చేపట్టారు.
గాయపడినవారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతులు గాయపడినవారు సామర్లకోట ప్రాంతానికి చెందినవారిగా గుర్తించారు. ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.