Page Loader
Zipline: మనాలీ విహారయాత్రలో విషాదం.. జిప్‌లైన్ నుంచి పడిన 10 ఏళ్ల బాలిక పరిస్థితి విషమం
మనాలీ విహారయాత్రలో విషాదం.. జిప్‌లైన్ నుంచి పడిన 10 ఏళ్ల బాలిక పరిస్థితి విషమం

Zipline: మనాలీ విహారయాత్రలో విషాదం.. జిప్‌లైన్ నుంచి పడిన 10 ఏళ్ల బాలిక పరిస్థితి విషమం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 15, 2025
05:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

విహారయాత్రకు వెళ్లిన ఓ కుటుంబానికి తీరని విషాదం ఎదురైంది. నాగ్‌పూర్‌కు చెందిన ప్రఫుల్ల బిజ్వే కుటుంబం సమ్మర్ హాలిడేస్‌ను ఆస్వాదించేందుకు మనాలీ టూర్‌కు వెళ్లింది. అయితే ఈ విహారయాత్ర వారికి దురదృష్టవశాత్తు చేదు అనుభవంగా మారింది. జూన్ 8న జరిగిన ఘటనలో వారి 10 ఏళ్ల కూతురు త్రిష బిజ్వే జిప్‌లైన్ ప్రయాణంలో విషాదకర ప్రమాదానికి గురైంది. జిప్‌లైన్‌లో ప్రయాణిస్తున్న సమయంలో త్రిష ధరించిన బెల్ట్ అకస్మాత్తుగా తెగిపోయింది. ఫలితంగా ఆమె సుమారు 30 అడుగుల లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో త్రిష కాలి ఎముక విరిగింది. అంతేగాక శరీరంలోని పలుచోట్ల తీవ్రమైన ఫ్రాక్చర్లు ఏర్పడ్డాయి.

Details

బాలిక ఆరోగ్య పరిస్థితి విషమం

ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఘటన అనంతరం కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సంఘటనా స్థలంలో సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడమే కాకుండా, ప్రమాదం జరిగిన వెంటనే ఎలాంటి అత్యవసర సహాయం అందలేదని వారు ఆరోపిస్తున్నారు. మొదట మనాలీలో ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు అనంతరం త్రిషను చండీగఢ్‌లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెను నాగ్‌పూర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే, త్రిష ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న వీడియో