Page Loader
Food Poison: హైదరాబాద్‌లో విషాదం.. మోమోస్ తిని ఒకరు మృతి, 20 మందికి పైగా అస్వస్థత
హైదరాబాద్‌లో విషాదం.. మోమోస్ తిని ఒకరు మృతి, 20 మందికి పైగా అస్వస్థత

Food Poison: హైదరాబాద్‌లో విషాదం.. మోమోస్ తిని ఒకరు మృతి, 20 మందికి పైగా అస్వస్థత

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 28, 2024
03:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్ నగరంలోని నందినగర్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. నందినగర్‌లో ఏర్పాటు చేసిన వారాంతపు సంతలో మోమోస్ తిని ఓ మహిళ మృతి చెందింది. మరో 20 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. బాధితులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంతలో అమ్ముడైన మోమోస్ కారణంగా అస్వస్థత కలిగిందని బాధితులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతానికి 20 మందికి పైగా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని, బాధితుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మృతురాలు సింగాడికుంట ప్రాంతానికి చెందిన మహిళగా గుర్తించారు.

Details

కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్ పోలీసులు

ఘటనపై బాధితురాలి కుమారుడు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ కేసును తీవ్రంగా పరిగణించి, నందినగర్, సింగాడికుంట, వెంకటేశ్వర కాలనీలలో మోమోస్ విక్రయించిన వారికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. ఈ ప్రదేశాల్లోని వీక్లీ మార్కెట్లలో విక్రయించిన మోమోస్‌నే అస్వస్థతకు కారణమని నిర్ధారించేందుకు దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికే మోమోస్ షాప్ నిర్వహణలో ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.