Kamareddy: కామారెడ్డిలో విషాదం.. శ్రుతి, నిఖిల్ తర్వాత ఎస్సై మృతదేహం వెలికితీత
ఈ వార్తాకథనం ఏంటి
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి పెద్ద చెరువులో ఎస్సై సాయికుమార్ మృతదేహం రెస్క్యూ బృందాలు వెలికితీశాయి.
బుధవారం రాత్రి అదే చెరువు నుంచి కానిస్టేబుల్ శ్రుతి, సహకార సంఘం ఆపరేటర్ నిఖిల్ మృతదేహాలు వెలికివేయడం తెలిసిందే.
భిక్కనూరు ఎస్సై సాయికుమార్‌తో పాటు బీబీపేట పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ శ్రుతి, బీబీపేట సహకార సంఘంలో ఆపరేటర్‌గా పనిచేస్తున్న నిఖిల్ ఒకేసారి అదృశ్యమయ్యారు.
అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు ఒడ్డున వారి వస్తువులు కనిపించడంతో పోలీసులు అక్కడికెళ్లి గాలింపు చేపట్టారు.
Details
ఎస్పీ సింధుశర్మ ఆధ్వర్యంలో గాలింపు చర్యలు
బుధవారం రాత్రి శ్రుతి, నిఖిల్ మృతదేహాలు బయట పడగా, గురువారం ఉదయం సాయికుమార్ మృతదేహం లభ్యమైంది.
ఈ గాలింపుని జిల్లా ఎస్పీ సింధుశర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎస్సై సాయికుమార్ సెల్‌ఫోన్ బుధవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి స్విచ్ ఆఫ్ కావడంతో పోలీసులు ఆయన ఆచూకీ కోసం ఆరా తీశారు.
ఇదే సమయంలో బీబీపేట పోలీస్ స్టేషన్‌లో విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్నట్లు చెప్పిన కానిస్టేబుల్ శ్రుతి కూడా తిరిగి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.
శ్రుతి ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆమె అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు వద్ద ఉన్నట్లు గుర్తించారు.
Details
దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు
ఎస్పీ నేతృత్వంలో చెరువు వద్ద గాలింపు చేపట్టగా, అక్కడ శ్రుతి సెల్‌ఫోన్‌తో పాటు నిఖిల్ సెల్‌ఫోన్ కూడా దొరికాయి.
అదనంగా సాయికుమార్ కారు, పాదరక్షలు, నిఖిల్ పాదరక్షలు కూడా చెరువు ఒడ్డున కనిపించాయి.
చెరువులో గాలింపు తర్వాత బుధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో శ్రుతి, నిఖిల్ మృతదేహాలు లభ్యమయ్యాయి. గురువారం ఉదయం సాయికుమార్ మృతదేహం వెలికితీయడం ద్వారా ఘటన మరింత కలకలం రేపింది.
ఈ ఘటనపై పోలీసులు అనుమానాస్పద కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
వారు అదృశ్యమైన నేపథ్యంలో చెరువు వద్ద కనిపించిన ఆధారాలు, ముగ్గురి మృతదేహాలు ఒకేసారి లభ్యం కావడం కారణంగా ఈ ఘటనపై మరిన్ని వివరాలు వెలుగులోకి రాబోతున్నాయి.
ఈ సంఘటన కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.