తదుపరి వార్తా కథనం
Siddipet: కొండ పోచమ్మ సాగర్‌లో విషాదం.. ఏడుగురు యువకులు గల్లంతు
వ్రాసిన వారు
Jayachandra Akuri
Jan 11, 2025
02:55 pm
ఈ వార్తాకథనం ఏంటి
సిద్ధిపేట జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది.
కొండ పోచమ్మ సాగర్‌లో ఈతకోసం వెళ్లిన ఏడుగురు యువకులు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
వారి మృతదేహాలు లభ్యం కాగా, మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
మృతులు హైదరాబాద్ ముషిరాబాద్ కు చెందిన ధనుష్, లోహిత్, దినేశ్వర్, సాహిల్, జతిన్ గా గుర్తించారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.