Page Loader
Nara Rohith : నారా రోహిత్ కుటుంబంలో విషాదం.. రామ్మూర్తి నాయుడు కన్నుమూత 
నారా రోహిత్ కుటుంబంలో విషాదం.. రామ్మూర్తి నాయుడు కన్నుమూత

Nara Rohith : నారా రోహిత్ కుటుంబంలో విషాదం.. రామ్మూర్తి నాయుడు కన్నుమూత 

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 16, 2024
02:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ హీరో నారా రోహిత్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు, నారా రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు హఠాన్మరణం చెందారు. రామ్మూర్తి నాయుడు గుండెపోటుతో (కార్డియాక్ అరెస్ట్) మరణించినట్లు కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. రామ్మూర్తి నాయుడు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇవాళ ఉదయం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించిన నేపథ్యంలో ఆయన్ను హైదరాబాదులోని ఏఐజీ హాస్పిటల్‌కు తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.

Details

రేపు నారావారిపల్లెలో అంత్యక్రియలు

ఈ సమాచారం తెలుసుకున్న సీఎం చంద్రబాబు నాయుడు తన మహారాష్ట్ర పర్యటనను రద్దు చేసుకుని హుటాహుటిన హైదరాబాదుకు చేరుకున్నారు. నారా లోకేష్ కూడా తన అన్ని కార్యక్రమాలను తాత్కాలికంగా నిలిపివేశారు. రామ్మూర్తి నాయుడు మరణం పట్ల నందమూరి కుటుంబం సంతాపం వ్యక్తం చేసింది. రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు రేపు ఆయన స్వగ్రామం నారావారిపల్లెలో జరగనున్నాయి