Krishna River: పల్నాడులో విషాదం.. కృష్ణా నదిలో పడవ బోల్తా, నలుగురు గల్లంతు!
వ్రాసిన వారు
Jayachandra Akuri
Jun 14, 2026
03:14 pm
ఈ వార్తాకథనం ఏంటి
పల్నాడు జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కోనూరు ప్రాంతంలో కృష్ణా నదిలో ప్రయాణిస్తున్న ఓ పడవ బోల్తా పడటంతో నలుగురు గల్లంతయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగించింది. సమాచారం ప్రకారం, 10 మంది బంధువులు కోనూరులో జరిగిన ఓ కుటుంబ కార్యక్రమానికి హాజరయ్యేందుకు పడవలో వెళ్లారు. కార్యక్రమం ముగిసిన అనంతరం తిరుగు ప్రయాణంలో ఉండగా, కృష్ణా నదిలో పడవ ఒక్కసారిగా బోల్తా పడింది. దీంతో పడవలో ఉన్న వారంతా నీటిలో మునిగిపోయారు.
వివరాలు
ఆరుగురిని సురక్షితంగా బయటికి తీసిన గ్రామస్తులు
ఘటనను గమనించిన స్థానిక గ్రామస్థులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి ఆరుగురిని సురక్షితంగా బయటకు తీశారు. అయితే మరో నలుగురు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గ్రామస్థుల సహకారంతో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నదిలో విస్తృతంగా శోధన కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.