Sricity Boiler Blast: శ్రీసిటీలో విషాదం.. బాయిలర్ పేలి నలుగురు కార్మికులు మృతి
వ్రాసిన వారు
Jayachandra Akuri
Oct 03, 2026
11:25 am
ఈ వార్తాకథనం ఏంటి
తిరుపతి జిల్లా శ్రీసిటీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మందుల తయారీ చేసే టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో మొత్తం నలుగురు మృతిచెందారు. నైట్ షిఫ్ట్‌లో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు కార్మికులు బాయిలర్ పేలుడు ఘటనలో అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని వెంటనే తడ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే చికిత్స పొందుతూ ఆ ఇద్దరూ కూడా మృతిచెందారు. మృతుల్లో ఇద్దరిని పోలీసులు గుర్తించారు.
వివరాలు
శ్రీసిటీలో కలకలం
సత్యవేడు మండలం చెరివి గ్రామానికి చెందిన చిన్న మస్తాన్ (45), తమిళనాడులోని మాదరపాకానికి చెందిన రమేశ్ (45)గా గుర్తించారు.
మిగిలిన మరో ఇద్దరు మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఈ ఘటనతో శ్రీసిటీలో ఒక్కసారిగా కలకలం రేగింది.