LOADING...
Nagavaraprasad: విశాఖలో విషాదం.. వసుధ ఫార్మా డైరెక్టర్ నాగవరప్రసాద్ ఆత్మహత్య
విశాఖలో విషాదం.. వసుధ ఫార్మా డైరెక్టర్ నాగవరప్రసాద్ ఆత్మహత్య

Nagavaraprasad: విశాఖలో విషాదం.. వసుధ ఫార్మా డైరెక్టర్ నాగవరప్రసాద్ ఆత్మహత్య

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 01, 2025
03:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

విశాఖపట్టణంలో విషాద ఘటన చోటుచేసుకుంది. వసుధ ఫార్మా సంస్థ డైరెక్టర్ మంతెన వెంకట సూర్య నాగవరప్రసాద్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రగతి మైదానంలో వరప్రసాద్ విగతజీవిగా పడి ఉండటాన్ని గుర్తించిన వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆయన మృతదేహం పక్కనే పురుగుల మందు డబ్బా కనిపించడంతో ఇది ఆత్మహత్యగా తేల్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, వరప్రసాద్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. అలాగే ఆయన కుటుంబ సభ్యులకు ఈ విషాద వార్తను అందించారు.