LOADING...
UP: తీస్తా తీరంలో విషాదం.. 12 రోజులైనా లభించిన నవ దంపతుల జాడ!
తీస్తా తీరంలో విషాదం.. 12 రోజులైనా లభించిన నవ దంపతుల జాడ!

UP: తీస్తా తీరంలో విషాదం.. 12 రోజులైనా లభించిన నవ దంపతుల జాడ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 09, 2025
11:38 am

ఈ వార్తాకథనం ఏంటి

సిక్కింలో హనీమూన్‌కు వెళ్లిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన నవ దంపతులపై విషాదం ముసురుకుంది. యూపీలోని ప్రతాప్‌గఢ్ జిల్లాకు చెందిన కౌశలేంద్ర ప్రతాప్ సింగ్‌కు మే 5న అంకితా సింగ్ అనే యువతితో వివాహం జరిగింది. అనంతరం మే 24న నూతన వధూవరులు హనీమూన్ కోసం సిక్కింకు పయనమయ్యారు. అయితే మే 29న జరిగిన ఘోర ప్రమాదం వారి జీవితాల్లో తీరని విషాదాన్ని మిగిల్చింది. ఆరోజు పర్యటన నిమిత్తం వారు ప్రయాణిస్తున్న కారు కొండచరియలు విరిగిపడటంతో అదుపుతప్పి 1,000 అడుగుల లోతున్న తీస్తా నదిలో పడిపోయింది. ప్రమాద సమయంలో కారులో మొత్తం 11 మంది ప్రయాణిస్తున్నారని సమాచారం. వారిలో ఇద్దరిని స్థానికులు సురక్షితంగా బయటకు తీశారు.

Details

ఎనిమిది మంది గల్లంతు

డ్రైవర్ మరణించగా, మిగిలిన ఎనిమిది మంది మాత్రం గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో నూతన వధూవరులతో పాటు నలుగురు ఒడిశా, ఇద్దరు త్రిపురకు చెందినవారున్నట్టు అధికారులు తెలిపారు. ఘటన అనంతరం ఎన్డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక సిబ్బంది, అటవీశాఖ బృందాలు సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో కౌశలేంద్ర తండ్రి షేర్ బహదూర్ సింగ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, "12 రోజులైనా మా కుమారుడు, కోడలిని గుర్తించలేకపోయాం" అని కన్నీటి పర్యంతమయ్యారు. గాలింపు చర్యలను వేగవంతం చేయాలని, తమ బిడ్డల ఆచూకీ తెలిసేలా చర్యలు తీసుకోవాలని ఆయన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, సిక్కింకు సీఎంకి విజ్ఞప్తి చేశారు. ఈ ఘటన పర్యాటకుల భద్రతపై అనేక ప్రశ్నలు రేపుతోంది.