తదుపరి వార్తా కథనం

Guntur: గుంటూరు జిల్లాలో విషాద ఘటన.. కాల్వలో కారు కొట్టుకుపోయి ముగ్గురు మృతి
వ్రాసిన వారు
Jayachandra Akuri
Aug 31, 2024
04:33 pm
ఈ వార్తాకథనం ఏంటి
గుంటూరు జిల్లాలో భారీ వర్షం కారణంగా వాగులు, వంకలు, కాలువలు పొంగిపోర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి.
ఇక వరద కారణంగా పెదకాకాని మండలం ఉప్పలపాడు-గోళ్లమూడి వద్ద కాల్వ ఒక్కసారిగా పొంగింది.
ఈ వరద ఉధృతిలో కారు కొట్టుకుపోవడంతో ముగ్గురు ప్రయాణికులు మృతి చెందారు.
విషయం తెలుసుకున్న అధికారులు కారును బయటికి తీశారు.
టీచర్ ఫ్యామిలీ వీవీటి కాలేజీ నుంచి ఇంటికెళ్తుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు రాఘవేంద్ర, సాత్విక్, మాన్విక్‌గా గుర్తించారు.