Dense Fog: దిల్లీలో పొగమంచు కారణంగా ఆలస్యంగా నడుస్తున్న రైళ్లు, విమానాలు
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తర భారతదేశం చలితో తీవ్రంగా ప్రభావితమవుతోంది. దిల్లీ సహా పలు రాష్ట్రాల్లో దట్టమైన పొగమంచు కమ్మేయడంతో విమానాలు రద్దు కావడం, మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి.
ఈ రోజు ఉదయం 4 నుంచి 8 గంటల వరకు జీరో విజిబిలిటీ నమోదు కాగా, ఆ తరువాత విజిబిలిటీ 50 మీటర్లకు మెరుగుపడింది.
దీంతో దిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో 6 విమానాలు రద్దు అయినట్లు ప్రకటించారు. ఇక మరో 123 విమానాలు సగటున 20 నిమిషాలు ఆలస్యంగా ప్రయాణం కొనసాగిస్తున్నాయి.
అలాగే 81 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి, మరో 59 రైళ్లు ఆరు గంటల ఆలస్యంతో, 22 రైళ్లు ఎనిమిది గంటల ఆలస్యంతో ప్రయాణం కొనసాగుతున్నాయని ఉత్తర రైల్వే డిపార్ట్మెంట్ తెలిపింది.
Details
10 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు
దిల్లీకి సంబంధించిన సమాచారం ప్రకారం, ఉష్ణోగ్రత 10 డిగ్రీలకు పడిపోయింది.
సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు డేటా ఆధారంగా, ఈ రోజు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 377గా నమోదు అయింది. వాతావరణశాఖ చలిగాలుల వల్ల దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
శనివారం కూడా, జీరో విజిబిలిటీ దాదాపు తొమ్మిది గంటల వరకు కొనసాగింది.
దీంతో 48 విమానాలు రద్దు కాగా, 564 విమానాలు ఆలస్యంగా నడిచాయి. అలాగే, 15 విమానాలను దారి మళ్లించినట్లు అధికారులు ప్రకటించారు.