LOADING...
Visakhapatnam: విశాఖ రుషికొండ బీచ్‌లో కనిపించిన 'సొర్రు'.. అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు
విశాఖ రుషికొండ బీచ్‌లో కనిపించిన 'సొర్రు'.. అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు

Visakhapatnam: విశాఖ రుషికొండ బీచ్‌లో కనిపించిన 'సొర్రు'.. అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు

వ్రాసిన వారు Sirish Praharaju
May 13, 2026
09:10 am

ఈ వార్తాకథనం ఏంటి

విశాఖపట్టణంలోని రుషికొండ బీచ్‌ వద్ద అరుదుగా కనిపించే పారదర్శక జెల్లీఫిష్‌ కనిపించి సందర్శకులను ఆకర్షించింది. శరీరం మొత్తం స్పష్టంగా కనిపించే ఈ సముద్ర జీవిని అక్కడి మత్స్యకారులు స్థానికంగా 'సొర్రు' అని పిలుస్తారని తెలిపారు. రాళ్ల ప్రాంతాల్లో పెరిగే నాచును ఆహారంగా తీసుకునేందుకు ఈ తరహా జెల్లీఫిష్‌లు తీర ప్రాంతాలకు చేరుకుంటాయని మత్స్యశాఖ అధికారులు వెల్లడించారు. అప్పుడప్పుడు ఇలాంటి జీవులు ఒడ్డుకు సమీపంలో కనిపించడం సహజమేనని చెప్పారు. అయితే వీటి వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని స్పష్టం చేశారు. వీటి దగ్గరకు వెళ్లడం ప్రమాదకరమని హెచ్చరించారు. జెల్లీఫిష్‌పై ఉండే నురగ శరీరానికి తగిలితే హానికర ప్రభావాలు కలిగే అవకాశం ఉందని అధికారులు వివరించారు.

Advertisement