Loading...
Ethanol petrol: ఇథనాల్‌ పెట్రోల్‌కు వ్యతిరేకంగా ఆగస్టు 4న పార్లమెంట్‌కు రవాణా సంఘాల మార్చ్
ఇథనాల్‌ పెట్రోల్‌కు వ్యతిరేకంగా ఆగస్టు 4న పార్లమెంట్‌కు రవాణా సంఘాల మార్చ్

Ethanol petrol: ఇథనాల్‌ పెట్రోల్‌కు వ్యతిరేకంగా ఆగస్టు 4న పార్లమెంట్‌కు రవాణా సంఘాల మార్చ్

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 27, 2026
11:55 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌ (ఇథనాల్‌-20) అమలుకు వ్యతిరేకంగా ఢిల్లీ ట్యాక్సీ,పర్యాటక, టూర్‌ ఆపరేటర్ల సంఘం ఆగస్టు 4న పార్లమెంట్‌కు పాదయాత్ర నిర్వహించనున్నట్లు శనివారం ప్రకటించింది. ఈ ఆందోళనకు ట్యాక్సీ, ట్రాన్స్‌పోర్ట్‌ రంగానికి చెందిన పలువురు ప్రతినిధులు మద్దతు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా ట్రాన్స్‌పోర్టర్స్‌ సంఘం అధ్యక్షుడు సంజయ్‌ సామ్రాట్‌ మాట్లాడుతూ.. ఇథనాల్‌-20 విధానం అమల్లోకి వచ్చిన తర్వాత దేశంలోని పలు ప్రాంతాల రవాణా నిర్వాహకులు, వాహన యజమానులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు.

వివరాలు 

ప్రభుత్వం తన విధానాన్ని పునఃసమీక్షించాలి: సంజయ్‌ సామ్రాట్

ముఖ్యంగా వాహనాల ఇంధన సామర్థ్యం తగ్గడం, నిర్వహణ వ్యయాలు పెరగడం, ఇంజిన్‌ పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు.

అదేవిధంగా, పెట్రోల్‌కు పూర్తి ధర చెల్లిస్తున్న వినియోగదారులకు ఇథనాల్‌ మిశ్రమ ఇంధనం ఎందుకు సరఫరా చేస్తున్నారనే ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ఇంధన ధరలు పెరుగుతున్న ఈ పరిస్థితిలో వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తన విధానాన్ని పునఃసమీక్షించాలని ఆయన కోరారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఇథనాల్‌ పెట్రోల్‌ అమలుకు వ్యతిరేకంగా రవాణా రంగం ఆందోళన బాట

ADVERTISEMENT