LOADING...
Kurnool bus accident: కర్నూలు ప్రమాదం.. సీటింగ్‌ పర్మిషన్‌ తీసుకుని బస్సును స్లీపర్‌గా మార్చి 
కర్నూలు ప్రమాదం.. సీటింగ్‌ పర్మిషన్‌ తీసుకుని బస్సును స్లీపర్‌గా మార్చి

Kurnool bus accident: కర్నూలు ప్రమాదం.. సీటింగ్‌ పర్మిషన్‌ తీసుకుని బస్సును స్లీపర్‌గా మార్చి 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 24, 2025
02:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

కర్నూలులోని బస్సు ప్రమాదం రవాణా శాఖలో లోసుగులు బయటపెట్టింది.ఆల్‌ ఇండియా పర్మిట్‌ పేరిట ప్రైవేట్ ట్రావెల్స్‌ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి. ప్రమాదానికి గురైన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు డయ్యూ డామన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకొని, ఆల్‌ఇండియా పర్మిట్ పొందింది. తరువాత, బస్సును ఒడిశా రాయగడలో ఆల్ట్రేషన్ చేసి,ఫిట్‌నెస్ సర్టిఫికెట్ పొందారు. ఈ ఆల్ట్రేషన్ సమయంలో రాయగడ అధికారులు 43 సీట్లకు మాత్రమే అనుమతించగా బస్సు యాజమాన్యం బస్సును స్లీపర్‌గా మార్చింది.. ఈ బస్సు 2018లో తెలంగాణలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 2023లో ఎన్‌వోసీతో డయ్యూ డామన్‌లో మరల రిజిస్ట్రేషన్ చేసి, స్లీపర్ కోచ్‌గా మార్చారు.