
Pahalgam: కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు తరువాత ఏర్పడిందే టీఆర్‌ఎఫ్
ఈ వార్తాకథనం ఏంటి
పహల్గాంలో బైసరన్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడికి కారణమైన 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్‌ఎఫ్)' అనే ఉగ్రవాద సంస్థ ఇటీవలే ఏర్పడింది.
కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన అనంతరం ఈ సంస్థ రూపుదిద్దుకుంది. ఆరంభంలో టీఆర్‌ఎఫ్ ఆన్‌లైన్ వేదికగా ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడేది.
అయితే ఆరు నెలల వ్యవధిలోనే ఈ సంస్థ లష్కరే తోయిబా వంటి ఇతర ఉగ్ర సంస్థల సభ్యులను చేర్చుకుంటూ భౌతిక స్థాయిలో కార్యాచరణ ప్రారంభించింది.
ఈ టీఆర్‌ఎఫ్ వెనుక పాకిస్థాన్ ప్రమేయం ఉందని నిఘా సంస్థలు వెల్లడించాయి.
ప్రత్యేకించి పాకిస్థాన్‌కు చెందిన ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్‌ఐ)ఈ సంస్థను సృష్టించిందని నిశ్చయించారు.
అంతర్జాతీయంగా లష్కరే తోయిబాపై ముద్ర పడకుండా,దృష్టిని మళ్లించేందుకు టీఆర్‌ఎఫ్‌ను ముందుకు తెచ్చారని అనుమానిస్తున్నారు.
వివరాలు
టీఆర్‌ఎఫ్ 2019లో ఏర్పడింది
2018లో లష్కరే తోయిబా ఉగ్ర కార్యకలాపాల కారణంగా ఆర్థిక చర్యల టాస్క్ ఫోర్స్ (FATF) పాక్‌ను నిషేధిత దేశాల జాబితాలో చేర్చిన సంగతి తెలిసిందే.
ఆ తర్వాతే తాము సర్దుబాటు చర్యలు తీసుకుంటున్నట్లు చూపించేందుకు పాకిస్థాన్ టీఆర్‌ఎఫ్‌ను తీసుకొచ్చినట్లు నిపుణులు చెబుతున్నారు.
టీఆర్‌ఎఫ్ 2019లో ఏర్పడి అప్పటినుంచి వరుస దాడులకు పాల్పడుతోంది.
ముఖ్యంగా కశ్మీర్‌లో తమ ఉనికిని నిలబెట్టుకునే క్రమంలో దాడులు చేపడుతోంది. దాంతో భారత ప్రభుత్వం 2023లో ఈ సంస్థను ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చింది.
వివరాలు
టీఆర్‌ఎఫ్ స్థాపకుడు సజ్జాద్ గుల్
టీఆర్‌ఎఫ్‌ను స్థాపించిన వ్యక్తి షేక్ సజ్జాద్ గుల్ అలియాస్ షేక్ సజ్జాద్. ఇతడు స్వయంగా కశ్మీరీ మిలిటెంట్.
2018 జూన్ 14న శ్రీనగర్‌లో ప్రముఖ జర్నలిస్టు షుజాత్ బుఖారీ, అతడి భద్రతా సిబ్బందిపై జరిగిన హత్యాయత్నానికి సజ్జాద్ గుల్‌నే ప్రధాన సూత్రధారి అని గుర్తించారు.
దేశ ద్రోహ చర్యల కారణంగా కేంద్ర ప్రభుత్వం అతడిని ఉగ్రవాదిగా గుర్తించి యుఏపీఏ చట్టం కింద కేసు నమోదు చేసింది.
గతంలో లష్కరే తోయిబాలో కమాండర్‌గా ఉన్న ఈ సజ్జాద్, తరువాత టీఆర్‌ఎఫ్‌ను ప్రారంభించాడు.
ప్రస్తుతం టీఆర్‌ఎఫ్‌లో పనిచేస్తున్న ప్రముఖ ఉగ్రవాదుల్లో సాజిద్ జాట్, సలీం రెహ్మానీ ముఖ్యులు. వీరిద్దరూ గతంలో లష్కరే తోయిబాలో సభ్యులుగా ఉన్నారు.
వివరాలు
టీఆర్‌ఎఫ్ నిర్వహించిన ప్రధాన దాడులు
టీఆర్‌ఎఫ్ అన్ని మతాల వారినీ లక్ష్యంగా చేసుకుంటూ దాడులకు పాల్పడుతోంది. కశ్మీరీ పండితులు, సిక్కులు, హిందువులు, ముస్లింలు అనే తేడా లేకుండా టీఆర్‌ఎఫ్ టార్గెట్ చేస్తోంది.
2020 ఏప్రిల్ 1: కుప్వారా జిల్లా కేరన్ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వద్ద నాలుగు రోజుల పాటు కాల్పుల మార్పిడి జరిగింది. ఆ సమయంలోనే మొదటిసారిగా టీఆర్‌ఎఫ్ పేరు బయటికి వచ్చింది.
2020 అక్టోబర్ 30: దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో మూడు భాజపా కార్యకర్తలను టీఆర్‌ఎఫ్ ఉగ్రవాదులు హత్య చేశారు.
2020 నవంబర్ 26: శ్రీనగర్ సమీపంలోని లాయేపోరా ప్రాంతంలో రెండు రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్లపై దాడికి పాల్పడిన టీఆర్‌ఎఫ్ ఉగ్రవాదులు,ఆ దృశ్యాలను వీడియో తీసారు. ఈ దాడిలో ఇద్దరు భారత సైనికులు మరణించారు.
వివరాలు
టీఆర్‌ఎఫ్ నిర్వహించిన ప్రధాన దాడులు
2023 ఫిబ్రవరి 26: పుల్వామా జిల్లాలో సంజయ్ శర్మ అనే కశ్మీరీ పండితుడిని టీఆర్‌ఎఫ్ ఉగ్రవాదులు హత్య చేశారు.
2024 అక్టోబర్ 20: గండేర్‌బల్ జిల్లాలోని సోన్‌మార్గ్‌లో ఒక వైద్యుడు, ఆరుగురు వలస కార్మికులు టీఆర్‌ఎఫ్ దాడిలో మృతిచెందారు.