LOADING...
Trump: దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌పై ట్రంప్ ప్రశంసల వర్షం
దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌పై ట్రంప్ ప్రశంసల వర్షం

Trump: దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌పై ట్రంప్ ప్రశంసల వర్షం

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 17, 2026
10:38 am

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన తరంజిత్ సింగ్ సంధుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. గతంలో భారత్ తరఫున అమెరికాలో రాయబారిగా పనిచేసిన సంధు, భారత్-అమెరికా సంబంధాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారని ట్రంప్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆయన ట్రూత్ సోషల్ వేదికగా షేర్ చేసిన పోస్టులో వెల్లడించారు. దిల్లీ నూతన లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమితులైన తరణ్‌జీత్ సింగ్ సంధుకు అభినందనలు. అనుభవజ్ఞుడైన దౌత్యవేత్తగా, అమెరికా మాజీ రాయబారిగా భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాల బలపాటుకు ఆయన చూపిన నిబద్ధత ప్రశంసనీయమని ట్రంప్ కొనియాడారు. సంధు నాయకత్వంలో దిల్లీ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ, ఆయనతో కలిసి దిగిన ఫొటోను కూడా పంచుకున్నారు.

వివరాలు

మోదీ  మంచి మిత్రుడు

కాగా, సంధు మార్చి 11న దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఇదే సందర్భంలో నరేంద్ర మోదీతో తన స్నేహ సంబంధాలపై కూడా ట్రంప్ ప్రస్తావించారు. మోదీ తనకు మంచి స్నేహితుడని పేర్కొన్న ఆయన, ఇటీవల జరిగిన ఫోన్ సంభాషణను గుర్తు చేశారు. "మా మధ్య మంచి చర్చ జరిగింది. భారత్ నుంచి మోదీ నా మంచి మిత్రుడు. ఆయన అద్భుతంగా పనిచేస్తున్నారని ట్రంప్ అన్నారు. ఇటీవల ట్రంప్, మోదీ దాదాపు 40 నిమిషాల పాటు ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఈ సంభాషణలో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు, భారత్-అమెరికా ద్వైపాక్షిక సహకారం, అలాగే హర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం వంటి కీలక అంశాలపై చర్చించినట్లు మోదీ 'ఎక్స్' వేదికగా వెల్లడించారు.

Advertisement