
Ts Elections : బీఆర్ఎస్ అభ్యర్థుల కుమారులపై కేసు.. డబ్బులు పంచుతున్నారని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగతున్నాయి. కానీ అక్కడక్కడ పలు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
ఈ మేరకు ఓటర్లకు డబ్బులు పంచుతుండగా పలువురు బీఆర్ఎస్ అభ్యర్థుల కుమారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ నేపథ్యంలోనే పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కుమారుడు విక్రంరెడ్డిపై కేసు నమోదైంది. తనపై దాడి చేశారని విక్రంరెడ్డిపై లక్కదొడ్దికి చెందిన ప్రవీణ్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు అరెస్ట్ చేశారు.
మరోవైపు ముషీరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఠా జై సింహాకు మద్దతుగా బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున రోడ్డుపైకి వచ్చిన ఆందోళన చేస్తున్నారు.
మరోవైపు జైసింహ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తొలిసారిగా నమోదు చేసుకున్న ఓటర్లంతా పెద్ద ఎత్తున పోలింగ్'కు హాజరుకావాలని సూచించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఓటు వేసిన ముఠా జై సింహా
Casted my vote now in #musheerabad
— Muta Jaisimha (@MutaJaisimha) November 30, 2023
I Appeal all eligible voters, especially the first time voters to come out and vote.#TelanganaElections2023 pic.twitter.com/DTKNDG2KJj