Page Loader
Chennamaneni Ramesh: వేములవాడ మాజీ ఎమ్మెల్యేకి తెలంగాణ హైకోర్టు షాక్‌.. అయన ఆ దేశ పౌరుడే.. 
వేములవాడ మాజీ ఎమ్మెల్యేకి తెలంగాణ హైకోర్టు షాక్‌.. అయన ఆ దేశ పౌరుడే..

Chennamaneni Ramesh: వేములవాడ మాజీ ఎమ్మెల్యేకి తెలంగాణ హైకోర్టు షాక్‌.. అయన ఆ దేశ పౌరుడే.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 09, 2024
12:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు తెలంగాణ హైకోర్టు తగిన షాక్ ఇచ్చింది. ఆయన పౌరసత్వం విషయంలో దాఖలైన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది.హైకోర్టు, చెన్నమనేని రమేశ్‌ జర్మనీ పౌరుడిగా ఉన్నారని స్పష్టం చేసింది. జర్మనీ పౌరుడిగా ఉండి ఎమ్మెల్యేగా గెలిచిన రమేశ్‌ 15సంవత్సరాల పాటు తప్పుడు డాక్యుమెంట్లతో కోర్టును తప్పుదోవ పట్టించారని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈకేసులో రమేశ్‌పై రూ.30లక్షల జరిమానా విధిస్తూ,నెలరోజుల్లో చెల్లించాలని ఆదేశించింది. ఈ మొత్తం డబ్బులో రూ. 25లక్షలు ప్రస్తుత ప్రభుత్వ విప్‌,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు,రూ. 5లక్షలు లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీకి చెల్లించాలని హైకోర్టు నిర్దేశించింది. కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఉన్న ఆది శ్రీనివాస్‌ చెన్నమనేని రమేశ్‌కు వ్యతిరేకంగా పౌరసత్వం అంశంలో ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు.