తదుపరి వార్తా కథనం
TS High Court: 'గేమ్ ఛేంజర్' చిత్రం ప్రత్యేక ప్రదర్శనపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి
వ్రాసిన వారు
Sirish Praharaju
Jan 10, 2025
01:55 pm
ఈ వార్తాకథనం ఏంటి
'గేమ్ ఛేంజర్' సినిమా టికెట్ ధరల పెంపు,ప్రత్యేక ప్రదర్శనలపై హైకోర్టులో విచారణ జరిగింది.
తాజా పరిణామాల నేపథ్యంలో ప్రత్యేకషోలకు అనుమతి ఇచ్చిన విధానంపై న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది.
బెనిఫిట్ షోలు రద్దు చేసినట్టుగా చెప్పి,పరోక్షంగా ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వడాన్నిప్రశ్నించింది.
అర్ధరాత్రి 1గంట తర్వాత షోలకు అనుమతించడంపై పునఃసమీక్ష చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఈమేరకు హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని సంబంధిత అంశాలను సమీక్షించమని సూచించింది.
ప్రేక్షకుల భద్రతను ప్రాముఖ్యతగా తీసుకుని,బెనిఫిట్,ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వకూడదని హైకోర్టు స్పష్టంగా సూచించింది.
సినిమాలు భారీబడ్జెట్‌తో తీసి ప్రేక్షకులపై ఆర్థిక భారం వేయడం సరైంది కాదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
ఈ అంశంపై తదుపరి విచారణను ఈనెల 24వ తేదీకి వాయిదా వేసింది.