LOADING...
TSBIE- 2024: తెలంగాణ ఇంటర్ హాల్ టికెట్లు విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి 
TSBIE- 2024: తెలంగాణ ఇంటర్ హాల్ టికెట్లు విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

TSBIE- 2024: తెలంగాణ ఇంటర్ హాల్ టికెట్లు విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి 

వ్రాసిన వారు Stalin
Feb 19, 2024
11:44 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ హాల్ టికెట్లను తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) విడుదల చేసింది. ఇండర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ tsbie.cgg.gov.inలో విద్యార్థులు హాల్ టిక్కెట్‌లను పొందవచ్చు. మొదటి సంవత్సరం పరీక్షల తేదీలు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 వరకు.. రెండో సంవత్సరం పరీక్షల తేదీలు ఫిబ్రవరి 29 నుంచి మార్చి 19, 2024 వరకు జరగనున్నాయి. ఈ ఏడాది 9.8 లక్షల మంది ఇంటర్ పరీక్షలను రాయనున్నారు. హాల్ టికెట్లలో విద్యార్థుల పేర్లు, రోల్ నంబర్లు, పరీక్ష కేంద్ర సమాచారాన్ని ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డు పొందుపర్చింది.

ఇంటర్

హాల్ టిక్కెట్లను ఇలా డౌన్ లోడ్ చేసుకోండి

విద్యార్థులు దిగువ అందించిన సూచనలను అనుసరించి.. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ హాల్ టిక్కెట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అధికారిక వెబ్‌సైట్‌ tsbie.cgg.gov.uk పై క్లిక్ చేయాలి. 2. 'Inter 1st and 2nd-year hall tickets 2024 TS' అని ఉన్న లింక్‌పై క్లిక్ చేయాలి. 3. లాగ్ ఇన్ బాక్స్‌లో విద్యార్థి పుట్టిన తేదీ, హాల్ టికెట్ నంబర్‌ను నమోదు చేయాలి. 4. ఆ తర్వాత సబ్మిట్‌‌పై క్లిక్ చేయాలి. 5. అనంతరం హాల్ టికెట్- 2024 స్క్రీన్‌పై కనపడుతుంది. పరీక్ష కోసం దాన్ని డౌన్ లోడ్ చేసుకోవాలి.