Page Loader
టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్; మరో డీఏని ప్రకటించిన యాజమాన్యం 
టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్; మరో డీఏని ప్రకటించిన యాజమాన్యం

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్; మరో డీఏని ప్రకటించిన యాజమాన్యం 

వ్రాసిన వారు Stalin
Jun 01, 2023
05:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సావాల వేళ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) యాజమాన్యం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ ఆవిర్భావ వేడుకల కానుకగా ఉద్యోగులకు మరో విడత డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌తో పాటు వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ వివరించారు. అలాగే గతేడాది ఉద్యోగులకు ఇవ్వాల్సిన 4.9శాతం డీఏను కూడా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఈ నెల వేతనంతో పాటే ఉద్యోగులకు ప్రకటించిన డీఏను ఇవ్వనున్నట్లు బాజిరెడ్డి గోవర్ధన్‌, వీసీ సజ్జనార్ పేర్కొన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఉద్యోగులకు తీపికబురు చెబుతూ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్