తదుపరి వార్తా కథనం
TTD: తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం.. హిందూయేతర ఉద్యోగులు,సిబ్బందిపై చర్యలు
వ్రాసిన వారు
Sirish Praharaju
Feb 05, 2025
04:27 pm
ఈ వార్తాకథనం ఏంటి
హిందూయేతర ఉద్యోగులు,సిబ్బందిపై తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) చర్యలు తీసుకోవడం ప్రారంభించింది.
విధుల్లో ఉన్న సమయంలో హిందూయేతర మత ఆచారాలు పాటించిన వారిపై తితిదే క్రమశిక్షణ చర్యలకు సిద్ధమైంది.
మొత్తం 18 మంది ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని తితిదే ఆదేశాలు జారీ చేసింది.
హిందూయేతర ఉద్యోగులను ఇతర విభాగాలకు బదిలీ చేయాలని తితిదే నిర్ణయం తీసుకుంది.
అలాగే, వీఆర్‌ఎస్ (ఐచ్ఛిక పదవీ విరమణ పథకం) తీసుకునే వారికి అనుమతి ఇచ్చేందుకు అంగీకరించింది.
తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు సూచనల మేరకు ఈ సంబంధిత ఆదేశాలను విడుదల చేసింది.
గత ఏడాది నవంబరు 18న జరిగిన తితిదే బోర్డు సమావేశంలో తీసుకున్న తీర్మానం ప్రకారం ఈ చర్యలు అమలు చేస్తున్నట్టు అధికారిక ఉత్తర్వుల్లో పేర్కొంది.