TTD: తిరుమల వాహనదారులకు టీటీడీ కొత్త సూచనలు
ఈ వార్తాకథనం ఏంటి
తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఆదివారం 84,950 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఇందులో 21,098 మంది తలనీలాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించారు.
ఈ ఒక్క రోజే హుండీ ద్వారా రూ.3.80 కోట్ల ఆదాయం టీటీడీకి లభించింది.
సర్వదర్శనానికి భక్తుల రద్దీ
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ఒక కంపార్ట్‌మెంట్ నిండిన నేపథ్యంలో, టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఆరు నుంచి ఎనిమిది గంటల సమయం పడింది.
వాటికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అల్పాహారం, పాలు, మంచినీరు అందజేశారు.
Details
వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు
తిరుమలలో వైకుంఠ ఏకాదశి పర్వదినం కోసం టీటీడీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. జనవరి 10 నుండి 19 వరకు లక్షలాది మంది భక్తులు శ్రీనివాసుడిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకునే అవకాశం పొందారు.
ఈ ఏర్పాట్ల గురించి తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు కార్యనిర్వహణాధికారి సీహెచ్ వెంకయ్య చౌదరి సమీక్ష నిర్వహించారు.
పోలీసుల సమీక్ష
టీటీడీ సీవీఎస్ఓ శ్రీధర్, తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడుతో కలిసి, తిరుమలలో అన్నమయ్య భవనంలో వైకుంఠ ద్వార దర్శనాల సమయంలో ట్రాఫిక్ నిర్వహణపై సమీక్ష నిర్వహించారు.
ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వాదశి రోజుల్లో వాహనాల రాకపోకలు సజావుగా ఉండేలా పోలీసుల సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సూచించారు.
Details
వాహనాల రాకపోకల నిర్వహణ
వాహనాల రద్దీని తగ్గించేందుకు ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 13,000 వాహనాలకు అనుకూలంగా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
గరుడ సేవ తరహాలో రామ్ బగీచా వద్ద ఎక్కువ సంఖ్యలో బగ్గీలను ఏర్పాటు చేయాలని తెలిపారు.
టోకెన్లపై స్పష్టత
టోకెన్లు, టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనాలు అందిస్తామని వెంకయ్య చౌదరి తెలిపారు. ఈ విషయంపై భక్తులకు అవగాహన కల్పించేందుకు వివిధ మార్గాల్లో ప్రచారం చేయాలని ఆయన సూచించారు.