
Hyderabad Metro : మెట్రో ప్రయాణికుల భద్రత కోసం 'TUTEM' యాప్ సిద్ధం
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ మెట్రో రైలు మహిళా ప్రయాణికుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోంది. ఇందులో భాగంగా, మహిళల కోసం ప్రత్యేకంగా 'TUTEM' పేరుతో ఒక మొబైల్ అప్లికేషన్‌ను అందుబాటులోకి తేబోతోంది.
బిట్స్ పిలానీ-హైదరాబాద్, హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ (HMRL), హైదరాబాద్ పోలీసు విభాగం, ఐఐటీ ఖరగ్పూర్, ముంబయిలోని పలు సంస్థలు కలిసి ఆసియా అభివృద్ధి బ్యాంకు (ADB) సహకారంతో ఈ యాప్‌ను అభివృద్ధి చేశారు.
ఈ సందర్భంగా మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ, మహిళలు ఇంటి నుంచీ గమ్యస్థానం వరకు సురక్షిత ప్రయాణం చేయడంలో ఈ టెక్నాలజీ ఆధారిత పరిష్కారం ఎంతో సాయపడుతుందన్నారు.
Details
మహిళ ప్రయాణికులకు భద్రత
'TUTEM' యాప్ మహిళా ప్రయాణికులకు భద్రతతో కూడిన ప్రయాణ అనుభూతిని కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ యాప్ ద్వారా అత్యవసర పరిస్థితుల్లో మహిళలు తక్షణ సహాయం పొందే అవకాశం ఉంటుంది. అలాగే, తమ ప్రయాణ వివరాలను విశ్వసనీయ వ్యక్తులతో షేర్ చేసుకునే ఫీచర్ కూడా ఇందులో ఉంది.
'TUTEM' యాప్ త్వరలో ప్రయాణికుల వినియోగానికి అందుబాటులోకి రానుంది. మహిళా భద్రత కోసం హైదరాబాద్ మెట్రో తీసుకుంటున్న ఈ చర్యలు అభినందనీయంగా నిలుస్తున్నాయి.