LOADING...
TVK Vijay: టీవీకే ఎమ్మెల్యేల భేటీ.. శాసనసభాపక్ష నాయకుడిగా విజయ్ ఏకగ్రీవ ఎన్నిక
టీవీకే ఎమ్మెల్యేల భేటీ.. శాసనసభాపక్ష నాయకుడిగా విజయ్ ఏకగ్రీవ ఎన్నిక

TVK Vijay: టీవీకే ఎమ్మెల్యేల భేటీ.. శాసనసభాపక్ష నాయకుడిగా విజయ్ ఏకగ్రీవ ఎన్నిక

వ్రాసిన వారు Moogati Shabari
May 05, 2026
04:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ భారీ విజయాన్ని సాధించింది. మొత్తం 234 స్థానాల్లో 108 స్థానాలు గెలుచుకుని రాష్ట్రంలో అత్యంత బలమైన శక్తిగా ఎదిగింది. మెజారిటీకి అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌కు కేవలం 10 సీట్ల దూరంలోనే ఆగిపోయింది. అయితే విజయ్‌కు మద్దతు ఇవ్వడానికి కొన్ని చిన్న పార్టీలు ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. ఇక చెన్నైలోని టీవీకే కార్యాలయంలో తాజాగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో విజయ్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పార్టీకి చెందిన అన్ని ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా విజయ్‌ను శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నుకున్నారు.

వివరాలు

సీఎం పదవికి స్టాలిన్ రాజీనామా

మరోవైపు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన పదవికి రాజీనామా చేయగా, ఆ రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానం ఇవ్వాలని కోరుతూ విజయ్ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌కు లేఖ రాశారు. ఆ లేఖను రాజ్‌భవన్‌కు ఈమెయిల్ ద్వారా పంపించారు. వచ్చే రెండు వారాల్లో తమ పార్టీ మెజారిటీని నిరూపిస్తామని లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం గవర్నర్ చెన్నైలో లేని కారణంగా, ఆయన తిరిగి వచ్చిన తర్వాత బుధవారం విజయ్ ఆయనను కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది.

వివరాలు

మరో సీటును వదులుకోనున్న విజయ్..

ఇక ఎన్నికల్లో విజయ్ రెండు నియోజకవర్గాల్లో విజయం సాధించారు. పెరంబూర్, తిరుచిరాపల్లి తూర్పు స్థానాల్లో ఆయన గెలుపొందారు. పెరంబూర్‌లో 1,20,365 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించగా, తిరుచిరాపల్లి తూర్పులో 27,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అయితే పెరంబూర్‌లో ఎక్కువ మెజారిటీ లభించిన నేపథ్యంలో, ఆ సీటును కొనసాగించి, మరో సీటును వదులుకోవాలని విజయ్ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న వీడియో..

Advertisement