Loading...
Visakhapatnam: రుషికొండ తీరంలో హోవర్‌ క్రాఫ్ట్‌ల సందడి.. చూసేందుకు పోటెత్తిన సందర్శకులు
రుషికొండ తీరంలో హోవర్‌ క్రాఫ్ట్‌ల సందడి.. చూసేందుకు పోటెత్తిన సందర్శకులు

Visakhapatnam: రుషికొండ తీరంలో హోవర్‌ క్రాఫ్ట్‌ల సందడి.. చూసేందుకు పోటెత్తిన సందర్శకులు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 06, 2026
09:06 am

ఈ వార్తాకథనం ఏంటి

విశాఖపట్టణంలోని రుషికొండ సముద్రతీరంలో రెండు అధునాతన రక్షణ హోవర్‌ క్రాఫ్ట్‌లు సందడి చేశాయి. వీటిని చూసేందుకు పర్యాటకులు, స్థానిక సందర్శకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సముద్రంలోనే కాకుండా ఇసుకపై కూడా వేగంగా ప్రయాణించే ఈ హోవర్‌ క్రాఫ్ట్‌లను చూసి పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కోస్ట్‌గార్డు విధుల్లో భాగంగా గోవా నుంచి పశ్చిమ బెంగాల్‌కు వెళ్తున్న రెండు హోవర్‌ క్రాఫ్ట్‌లు ప్రతికూల వాతావరణం, తుపాను గాలుల కారణంగా తీర ప్రాంతం వెంబడి ప్రయాణిస్తున్నాయని రుషికొండ మెరైన్‌ సీఐ కె.అశోక్‌కుమార్‌ గురువారం వెల్లడించారు. ఈ ప్రయాణంలో భాగంగా ఇంధనం నింపుకునేందుకు మాత్రమే వాటిని తాత్కాలికంగా విశాఖలోని రుషికొండ సముద్రతీరానికి తీసుకొచ్చినట్లు తెలిపారు.

వివరాలు 

సముద్ర మార్గాలపై పటిష్ఠమైన నిఘా

శుక్రవారం ఉదయం ఈ రెండు హోవర్‌ క్రాఫ్ట్‌లు తిరిగి పశ్చిమ బెంగాల్‌కు బయలుదేరుతాయని ఆయన వివరించారు.

ప్రధానంగా తీర ప్రాంతాల్లో అక్రమ రవాణాను అడ్డుకోవడంతో పాటు సముద్ర మార్గాలపై పటిష్ఠమైన నిఘా ఏర్పాటు చేసేందుకు వీటిని వినియోగిస్తారని పేర్కొన్నారు.

నీటిపై మాత్రమే కాకుండా ఇసుకపై కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వేగంగా దూసుకెళ్లే సామర్థ్యం ఈ హోవర్‌ క్రాఫ్ట్‌లకు ఉండటంతో వాటి ప్రయాణాన్ని చూసిన పర్యాటకులు ఆసక్తి కనబరిచారు.

ADVERTISEMENT