
Pahalgam Terror Attack: ఉగ్రవాదులకు సాయం చేసిన ఇద్దరు అరెస్ట్.. భారీగా ఆయుధాలు, గ్రనేడ్లు స్వాధీనం!
ఈ వార్తాకథనం ఏంటి
పహల్గాం ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో జమ్ముకశ్మీర్‌లో భద్రతా దళాలు ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి.
ఈ క్రమంలో బుద్గాం జిల్లాలో ముష్కరులకు సాయంగా వ్యవహరిస్తున్న ఇద్దరిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.
వారిది అనుమానాస్పద కదలికలుగా గుర్తించి చెక్‌పోస్టు వద్ద నాకా తనిఖీల్లో పట్టుకున్నారు. వారి వద్ద నిర్వహించిన తనిఖీలో పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రి బయటపడింది.
వాటిలో పిస్టల్‌లు, గ్రనేడ్లు, తూటాలు ఉన్నట్లు సమాచారం. దీంతో పోలీసులు వెంటనే వారిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.
ప్రాథమిక విచారణలో ఈ ఇద్దరూ ఉగ్రవాదులకు సహకరిస్తున్నట్లు వెల్లడైంది. భద్రతా దళాలు వారిపై మరింత విచారణ చేపట్టాయి.
Details
కేంద్ర హోంశాఖ కీలక సమీక్షకు రంగం సిద్ధం
దేశవ్యాప్తంగా యుద్ధ సన్నద్ధతపై కేంద్ర హోంశాఖ కీలక సమీక్షకు సిద్ధమవుతోంది.
అన్ని రాష్ట్రాల్లో యుద్ధ అప్రమత్తత అవసరమని సూచించిన కేంద్రం, బుధవారం రోజు సివిల్ మాక్‌డ్రిల్స్ నిర్వహించాలన్న ఆదేశాలను ఇచ్చింది.
ఈ నేపథ్యంతో మాక్‌డ్రిల్స్ ఏర్పాట్లపై మంగళవారం హోంశాఖ సమీక్ష సమావేశం నిర్వహించనుంది.
హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ నేతృత్వంలో ఉదయం 10.45 గంటలకు జరిగే ఈ సమీక్షలో దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 244 జిల్లాల్లో చేపట్టనున్న మాక్‌డ్రిల్స్ ఏర్పాట్లను సమీక్షించనున్నారు.
అన్ని రాష్ట్రాల అధికారులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.
ఈ చర్యలు దేశ భద్రత పరిరక్షణలో భాగంగా భవిష్యత్‌లో చోటుచేసుకునే అత్యవసర పరిస్థితులపై స్పందన సామర్థ్యాన్ని మెరుగుపర్చేందుకు చేపట్టబడుతున్నాయి.