Helicopter: అరేబియా సముద్రంలో కూలిన ఇండియన్ కోస్ట్ గార్డ్ హెలికాప్టర్.. ఇద్దరి మృతదేహాలు లభ్యం
అరేబియా సముద్రంలో ఒక హెలికాప్టర్ కూలిపోయి, ఆ ఘటనలో గల్లంతైన ముగ్గురిలో ఇద్దరి మృతదేహాలు లభించాయి. ఇండియన్ కోస్ట్ గార్డ్‌కు చెందిన ఈ Advanced Light Helicopter, సోమవారం రాత్రి అత్యవసర ఆపరేషన్‌కు వెళ్ళేటప్పుడు అరేబియా సముద్రంపై అత్యవసర ల్యాండ్ చేసే సమయంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒక సిబ్బందిని కోస్ట్ గార్డ్ వారు రక్షించగలిగారు, అయితే మిగతా ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. మంగళవారం, ఆ ముగ్గురిలో ఇద్దరి మృతదేహాలు వెలికితీశాయి. మృతులను కమాండెంట్ విపిన్ బాబు, ఎన్వీకే కరణ్ సింగ్ గా గుర్తించారు అని పోర్‌బందర్ కోస్ట్ గార్డ్ డిఐజి పంకజ్ అగర్వాల్ తెలిపారు.
అసలేం జరిగిందంటే?
పోర్‌బందర్ నుండి 45 కిలోమీటర్ల దూరంలో అరేబియా సముద్రంలో మోటార్ ట్యాంకర్ హరిలీలాలో సిబ్బందికి తీవ్ర గాయాలు జరిగాయి. ఈ పరిస్థితిని గుర్తించిన ఐసీజీ సాయానికి ఎమర్జెన్సీ మెసేజ్ అందించింది. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో సిబ్బందిని తరలించేందుకు ఏఎల్ హెచ్ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమైంది. అయితే,మార్గమధ్యలో హెలికాప్టర్‌లో సమస్య ఏర్పడడంతో ఎమర్జెన్సీ ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఈ సమయంలో హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో హెలికాప్టర్‌లో నలుగురు సిబ్బంది ఉన్నారు.కోస్ట్‌గార్డ్ తక్షణమే సహాయక చర్యలు చేపట్టింది. హెలికాప్టర్ శకలాన్ని గుర్తించి,ఒక సిబ్బందిని కాపాడగలిగారు.మంగళవారం మరొకరి శవాన్ని, తరువాత మరో ఇద్దరి శవాలను కనుగొని, ఇంకొకరి కోసం గాలింపు చర్యలు కొనసాగించాయి.