Page Loader
HMPV Virus : కర్ణాటకలో రెండు HMPV వైరస్ కేసులు.. ధృవీకరించిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ

HMPV Virus : కర్ణాటకలో రెండు HMPV వైరస్ కేసులు.. ధృవీకరించిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 06, 2025
12:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

చైనాలో హెచ్‌ఎంపీవీ (HMPV) వైరస్‌ కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో, భారత్‌లో కూడా ఆ వైరస్‌ పట్ల అలర్ట్‌ జారీ అయ్యింది. కర్ణాటక రాష్ట్రంలో ఈ వైరస్‌కు సంబంధించిన రెండు కేసులు గుర్తించబడ్డాయని ఐసీఎంఆర్ వెల్లడించింది. బెంగళూరులో 3 , 8 నెలల వయస్సు గల చిన్నారులకు ఈ వైరస్‌ సోకినట్లు నిర్ధారించింది. చైనాలో హ్యూమన్ మెటానిమోవైరస్‌ (HMPV) ఇతర శ్వాసకోశ సంబంధిత వ్యాధులు విస్తరిస్తున్నాయని, ఈ నేపథ్యంలో భారత్ ఇప్పటికే అప్రమత్తంగా ఉందని తెలుస్తోంది. ఇటీవలే డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ (DGHS) ఆధ్వర్యంలో జాయింట్‌ మానిటరింగ్‌ గ్రూప్‌ (JMG) సమావేశం ఏర్పాటు చేశారు.

వివరాలు 

 వైరస్‌ల వల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదు 

శీతాకాలంలో ఏర్పడిన వాతావరణ మార్పుల వల్ల చైనాలో ఇన్‌ఫ్లూయెంజా, ఆర్‌ఎస్‌వీ, హెచ్‌ఎంపీవీ వంటి వైరస్‌లు వేగంగా వ్యాపిస్తున్నాయని JMG వెల్లడించింది. అయితే, భారత్‌లో ఈ వైరస్‌ల వల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. ముందస్తు చర్యగా, ఆరోగ్యశాఖ వివిధ ప్రాంతాల్లో ఆర్‌ఎస్‌ఏ, హెచ్‌ఎంపీవీ వంటి వైరస్‌లపై పరీక్షలు నిర్వహిస్తోంది. శ్వాసకోశ సంబంధిత వ్యాధులు అనుకోకుండా పెరిగినా వాటిని ఎదుర్కొనేందుకు ప్రిపేర్‌ అయ్యామని ఆరోగ్యశాఖ ప్రకటించింది.