Cjp: కేంద్రంతో రెండు గంటల చర్చలు.. సీజేపీ డిమాండ్లపై కీలక ప్రకటన!
ఈ వార్తాకథనం ఏంటి
సీజేపీ ప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధుల మధ్య కీలక చర్చలు ముగిశాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే తమ ప్రధాన డిమాండ్‌పై సీజేపీ నేతలు మరోసారి స్పష్టమైన వైఖరి వెల్లడించారు. తమ అన్ని డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళనలను విరమించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ లో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ సీజేపీ ప్రతినిధులతో దాదాపు రెండు గంటలపాటు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా కేంద్ర మంత్రులకు తమ డిమాండ్లతో కూడిన నోట్‌ను సమర్పించారు. ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ కేసు విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలన్నారు.
వివరాలు
కొత్త చట్టాన్ని తీసుకురావాలి
అలాగే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కొత్త చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు.
చర్చల అనంతరం మాట్లాడిన సౌరవ్ దాస్.. మొత్తం మూడు ప్రధాన డిమాండ్లను కేంద్రం ముందుంచామని తెలిపారు.
అలాగే నీట్ పేపర్ లీక్ ఘటనల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం అందించాలని కోరినట్లు వెల్లడించారు.
అదేవిధంగా, ఆందోళనల్లో పాల్గొన్న నిరసనకారులపై నమోదైన కేసులను ఎత్తివేయాలన్న తమ డిమాండ్‌కు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి అంగీకరించినట్లు సౌరవ్ దాస్ తెలిపారు.
అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా సహా తమ ప్రధాన డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని సీజేపీ ప్రతినిధులు స్పష్టం చేశారు.