Soldiers Killed: రాజస్థాన్‌లో మందుగుండు పేలుడు కారణంగా ఇద్దరు జవాన్ల మరణం
రాజస్థాన్ బికనీర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌లో ఆర్టిలరీ ప్రాక్టీస్ చేస్తుండగా మందగుండు పేలడంతో ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో సైనికుడు తీవ్రంగా గాయపడడంతో, అతనిని వెంటనే సూరత్‌గఢ్‌లోని మిలటరీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం మహాజన్ ఫీల్డ్‌లోని చార్లీ సెంటర్‌లో జరిగింది. అక్కడ సైనిక విన్యాసాలు జరుగుతున్న సమయంలో పేలుడు సమయంలో ట్యాంకులో మందుగుండు ఎక్కిస్తుండగా ఈ విషాదం సంభవించింది.
వారం వ్యవధిలో రెండో ప్రమాదం
ఈ ఘటనపై సైనికాధికారులు విచారణ చేపట్టారు. మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌లో వారం వ్యవధిలో ఇది రెండో ప్రమాదం. 15 తేదీన కూడా ఓ సైనికుడు ప్రాణాలు కోల్పోయాడు. అప్పట్లో, టోయింగ్ వాహనానికి తుపాకీని అటాచ్ చేస్తుండగా, ర్యాంప్ పై ట్రాక్షన్ కోల్పోయి తిరిగి జారడంతో సైనికుడు తీవ్రంగా గాయపడ్డాడు. దానికి కారణంగా ఫీల్డ్ ఆసుపత్రికి తరలించగా వైద్యులు ఆయనను అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఈ సంఘటనలపై దర్యాప్తు కొనసాగుతున్నది.