Loading...
Delhi: ఢిల్లీలో భవనం కుప్పకూలి ఇద్దరు మృతి.. నలుగురికి గాయాలు!
ఢిల్లీలో భవనం కుప్పకూలి ఇద్దరు మృతి.. నలుగురికి గాయాలు!

Delhi: ఢిల్లీలో భవనం కుప్పకూలి ఇద్దరు మృతి.. నలుగురికి గాయాలు!

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 17, 2026
02:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశ రాజధాని దిల్లీలో భవనాలు కూలుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా మంగళవారం ఉదయం షహదరా ప్రాంతంలో ఓ భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఓ చిన్నారి కూడా ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు మొదటి అంతస్తు ఉన్న ఈ భవనం మంగళవారం ఉదయం కూలిపోయినట్లు అసిస్టెంట్ డివిజనల్ ఆఫీసర్ దీపక్ హుడా వెల్లడించారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, సహాయక బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాయి.

వివరాలు 

వరుస ప్రమాదాలతో ఆందోళన..

శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారా అనే విషయాన్ని గుర్తించడంతో పాటు, అందులో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు చేపట్టాయి.

ఈ పనుల్లో స్థానికులు కూడా అధికారులకు సహకరించారు. ఢిల్లీలో భవనాలు కూలుతున్న ఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి.

సోమవారం పహర్‌గంజ్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం కూలిపోయింది. ఈ ప్రమాదంలో సుమారు ఎనిమిది మంది కార్మికులు గాయపడ్డారు.

అంతకుముందు వారం ఓల్డ్ ఢిల్లీలోని చావ్రీ బజార్‌లో జరిగిన భవనం కూలిన ఘటనలో ఏడుగురు మరణించారు.

చావ్రీ బజార్ ప్రమాదంపై అధికారులు ప్రాథమిక నివేదికను రూపొందించారు. రెండో అంతస్తులో పైకప్పు నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో భవనంలోని కొంత భాగం కూలిపోయినట్లు గుర్తించారు.

వివరాలు 

భవనాల భద్రత, నిర్మాణ నాణ్యతపై ఆందోళనలు

భవనానికి మద్దతుగా ఉన్న పిల్లర్లు తడిగా ఉండటంతో పాటు.. నిర్మాణం ఒకవైపునకు ఒరిగినట్లు అధికారులు తమ నివేదికలో పేర్కొన్నారు.

ఇక సెప్టెంబర్‌లో ఢిల్లీలోని సత్య నికేతన్ ప్రాంతంలోనూ భారీ ప్రమాదం చోటుచేసుకుంది.

పేయింగ్ గెస్ట్ (పీజీ) వసతిగా ఉపయోగిస్తున్న ఆరు అంతస్తుల భవనం కూలిపోవడంతో ఐదుగురు విద్యార్థులు సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.

వరుసగా భవనాలు కూలిపోతుండటంతో నగరంలో భవనాల భద్రత, నిర్మాణ నాణ్యతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ADVERTISEMENT