
Manipur Violence: మణిపూర్‌లో అదేరోజు 40కి.మీ దూరంలో మరో ఇద్దరు మహిళలపై గ్యాంగ్ రేప్
ఈ వార్తాకథనం ఏంటి
మణిపూర్‌లో కుకీ కమ్యూనిటీకి చెందిన ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన బాధాకరమైన సంఘటన జరిగిన రోజునే మరో ఘోరం జరిగింది.
ఊరేగింపు జరిగిన దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో మరో ఇద్దరు గిరిజన మహిళలపై గ్యాంగ్ రేప్ జరిగినట్లు జాతీయ వార్తా సంస్థలు నివేదించాయి.
కార్ వాష్ షాపులో పనిచేస్తున్న మణిపూర్‌లోని కాంగ్‌పోక్పికి చెందిన ఇద్దరు గిరిజన మహిళలను వారి ఆఫీసు కార్యాలయంలో సామూహిక అత్యాచారం చేశారు.
అనంతరం ఆఫీసును నుంచి బయటకు లాగి వారిపై దాడి చేశారు.
ఈ ఘోరాన్ని ఆ మహిళల స్నేహితురాలు దూరం నుంచి చూసి వారి కుటుంబ సభ్యులకు తెలియజేసింది.
అలాగే తీవ్ర గాయాలతో ఉన్న వారిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించింది.
మణిపూర్
చికిత్స పొందుతూ ఇద్దరు మహిళలు మృతి
ఆస్పత్రిలో తీవ్రగాయాలతో చికిత్స పొందుతూ, ఇద్దరు మహిళలు చనిపోయారు. వాస్తవానికి ఆ మహిళల స్నేహితురాలిపై కూడా దుండగులు అత్యాచారం చేయబోగా, ఆమె తప్పించుకొని చర్చిలో దాక్కుంది.
ఈ క్రమంలోనే దూరం నుంచి ఈ ఘరాన్ని చూసింది. మే 4వ తేదీన సాయంత్రం 5:30గంటల ప్రాంతంలో ఈ దారుణం జరిగిందని బాధిత మహిళలతో కార్ వాష్‌షాపులో పని చేస్తున్నట్లు సహోద్యోగి చెప్పాడు.
ఆ రోజు షాపు దగ్గరికి కొంతమంది మహిళలు, పురుషులు వచ్చారని వివరించాడు. గుంపులోని మహిళలు బాధితులను గదిలోకి తీసుకెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడేలా పురుషులను ప్రోత్సహించారని సహోద్యోగి వెల్లడించాడు.
కొందరు పురుషులు బాధిత మహిళలను లోపలికి లాగి అత్యాచారం చేశారని, దాదాపు గంటన్నర పాటు ఈ దౌర్జన్యం కొనసాగిందని చెప్పాడు.