LOADING...
UGC equity regulation row: UGC కొత్త నిబంధనలపై దేశవ్యాప్తంగా రచ్చ.. అపోహలు తొలగించేందుకు రంగంలోకి ప్రభుత్వం!
అపోహలు తొలగించేందుకు రంగంలోకి ప్రభుత్వం!

UGC equity regulation row: UGC కొత్త నిబంధనలపై దేశవ్యాప్తంగా రచ్చ.. అపోహలు తొలగించేందుకు రంగంలోకి ప్రభుత్వం!

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 27, 2026
03:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) తీసుకొచ్చిన కొత్త నిబంధనలపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో,ఈ నిబంధనలపై వస్తున్న అపోహలు,తప్పుదారి పట్టించే ప్రచారాన్ని ఖండించేందుకు ప్రభుత్వం త్వరలోనే స్పష్టమైన వాస్తవాలను బయటపెట్టనుందని వర్గాలు News18‌కు తెలిపాయి. నిబంధనలను ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్వినియోగం చేయనివ్వబోమని, ఇవి అందరికీ సురక్షితమైన క్యాంపస్ వాతావరణాన్ని రూపొందించడానికే ఉద్దేశించబడ్డాయని ప్రభుత్వం స్పష్టం చేస్తున్నట్లు సమాచారం. జనవరి 13న UGC ప్రకటించిన 'ప్రమోషన్ ఆఫ్ ఈక్విటీ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ రెగ్యులేషన్స్, 2026'పై సాధారణ వర్గ విద్యార్థుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నిబంధనల వల్ల తమపై వివక్షకు అవకాశం ఉందని వారు వాదిస్తున్నారు.

వివరాలు 

వివక్షను అడ్డుకునేందుకు 'ఈక్విటీ స్క్వాడ్స్

కుల ఆధారిత వివక్షను అరికట్టాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన ఈ నిబంధనల ప్రకారం, కాలేజీలు, యూనివర్సిటీల్లో ప్రత్యేక కమిటీలు,హెల్ప్‌లైన్లు, మానిటరింగ్ బృందాలను ఏర్పాటు చేయాలని UGC ఆదేశించింది. ముఖ్యంగా SC, ST, OBC విద్యార్థుల ఫిర్యాదులను పరిష్కరించడమే వీటి ప్రధాన లక్ష్యంగా పేర్కొంది. ఈ నిబంధనల్లో భాగంగా ప్రతి విద్యాసంస్థలో సమాన అవకాశాల విభాగం (ఈక్వల్ అపార్చునిటీ సెల్) ఏర్పాటు చేయాలి. అలాగే ఈక్విటీ కమిటీలు లేదా మానిటరింగ్ వ్యవస్థలు,హెల్ప్‌లైన్లు (కొన్ని సందర్భాల్లో 24 గంటల సేవలు) ఏర్పాటు చేయడం,క్రమం తప్పకుండా UGCకి నివేదికలు పంపడం తప్పనిసరి. నిబంధనల అమలుపై సంస్థాధిపతులకు చట్టపరమైన బాధ్యత ఉంటుంది. అదనంగా, వివక్షను అడ్డుకునేందుకు 'ఈక్విటీ స్క్వాడ్స్' పేరుతో చిన్న బృందాలను కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.

వివరాలు 

నిబంధనలు ప్రకటించిన వెంటనే వీటిపై వ్యతిరేకత

ఈ నిబంధనలను పాటించని విద్యాసంస్థలపై కఠిన చర్యలు ఉంటాయని UGC హెచ్చరించింది. గుర్తింపు నిలిపివేత, UGC పథకాలలో భాగస్వామ్యం రద్దు వంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందని స్పష్టం చేసింది. నిబంధనలు ప్రకటించిన వెంటనే వీటిపై వ్యతిరేకత మొదలైంది. కొన్ని అగ్రవర్ణ సంఘాలు ఇవి దుర్వినియోగానికి లోనయ్యే ప్రమాదం ఉందని, తప్పుడు ఫిర్యాదులతో తమ వర్గాల విద్యార్థులు, అధ్యాపకులు ఇబ్బందులు పడే అవకాశం ఉందని వాదిస్తున్నాయి. సాధారణ వర్గాలపై ముందే నేరారోపణ చేసినట్లుగా ఈ నిబంధనలు ఉన్నాయని వారు అభిప్రాయపడుతున్నారు. జైపూర్‌లో కర్ణీ సేన, బ్రాహ్మణ మహాసభ, కాయస్థ మహాసభ, వైశ్య సంఘాలు కలిసి 'సవర్ణ సమాజ్ కోఆర్డినేషన్ కమిటీ (S-4)' పేరుతో ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమానికి దిగాయి.

Advertisement

వివరాలు 

UGC ప్రధాన కార్యాలయం ఎదుట అగ్రవర్ణ విద్యార్థులు నిరసన

ఇదిలా ఉండగా, మంగళవారం ఢిల్లీలోని UGC ప్రధాన కార్యాలయం ఎదుట అగ్రవర్ణ విద్యార్థులు నిరసనకు పిలుపునిచ్చారు. కొత్త నిబంధనల వల్ల క్యాంపస్‌ల్లో అస్తవ్యస్త పరిస్థితులు ఏర్పడతాయని వారు హెచ్చరించారు. ఈ విషయంపై PTIతో మాట్లాడిన ఢిల్లీ యూనివర్సిటీ పీహెచ్‌డీ విద్యార్థి అలొకిత్ త్రిపాఠి, కొత్త నిబంధనలతో కాలేజీల్లో పూర్తి స్థాయి గందరగోళం నెలకొంటుందని అన్నారు. ఆరోపణలు ఎదుర్కొనే వారిపైనే పూర్తి స్థాయిలో ఆధారాలు చూపాల్సిన భారం మోపుతున్నారని, తప్పుడు ఆరోపణలకు గురైన విద్యార్థులకు రక్షణ చర్యలు లేవని విమర్శించారు. "ఈ నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయి. బాధితుడి నిర్వచనమే ముందే నిర్ణయించినట్లుగా ఉంది. క్యాంపస్‌లో ఎవరికైనా బాధితుడిగా మారే అవకాశం ఉంది," అని త్రిపాఠి అన్నారు.

Advertisement

వివరాలు 

కొత్త UGC విధానాలపై అసంతృప్తి

"ఈక్విటీ స్క్వాడ్స్ పేరుతో క్యాంపస్‌లో ఎప్పుడూ నిఘాలో ఉన్నట్లే అనిపిస్తుంది," అని ఆయన వ్యాఖ్యానించారు. కొత్త UGC విధానాలపై అసంతృప్తి ఇప్పుడు పరిపాలనా, రాజకీయ వర్గాలకూ వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలో రాజీనామాలు కూడా మొదలయ్యాయి. బరేలీ సిటీ మేజిస్ట్రేట్ అలంకార్ అగ్నిహోత్రి సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. కొత్త UGC నిబంధనలు కుల ఆధారిత అసంతృప్తిని పెంచే ప్రమాదం ఉందని,ఇవి కాలేజీల విద్యా వాతావరణాన్ని దెబ్బతీస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఈ నిబంధనలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, వీటిని "బ్లాక్ లా"గా అభివర్ణించారు.

వివరాలు 

శ్యామ్ సుందర్ త్రిపాఠి రాజీనామా

అదే విధంగా, రాయ్‌బరేలీ జిల్లా సలోన్ నియోజకవర్గానికి చెందిన BJP కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు శ్యామ్ సుందర్ త్రిపాఠి కూడా కొత్త UGC విధానాలపై అసంతృప్తితో తన పదవికి రాజీనామా చేశారు. "అగ్రవర్ణ పిల్లలకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన ఈ రిజర్వేషన్ తరహా బిల్లులాంటి బ్లాక్ లా వల్ల నేను నా పదవికి రాజీనామా చేస్తున్నాను. ఇది సమాజానికి ప్రమాదకరం, విభజనాత్మకం. ఈ బిల్లుకు మద్దతు ఇవ్వడం నా ఆత్మగౌరవానికి, నా సిద్ధాంతాలకు విరుద్ధం," అని ఆయన ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.

Advertisement