UGC NET 2024 cancelled: రద్దైన పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారు? అప్‌డేట్ ఇచ్చిన NTA
విద్యా మంత్రిత్వ శాఖ UGC NET 2024 పరీక్షలను రద్దు చేసింది. ఆ తర్వాత జూన్ 18న జరిగిన పరీక్ష కూడా రద్దయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ పరీక్షకు వెళ్లనున్న లక్షలాది మంది అభ్యర్థులకు మళ్లీ అవకాశం ఎప్పుడు వస్తుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా, విద్యా మంత్రిత్వ శాఖ పరీక్షను రద్దు చేసిన కొద్దిసేపటికే, రాబోయే రోజుల్లో కొత్త పరీక్షను నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తెలిపింది.
పరీక్షకు రికార్డు స్థాయిలో 11 లక్షల మంది విద్యార్థులు
తేదీలను ఇంకా ప్రకటించలేదని, మరింత సమాచారం విడిగా పంచుకుంటామని NTA పోస్ట్‌లో తెలియజేసింది. ఈ వ్యవహారాన్ని సమగ్ర దర్యాప్తు కోసం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి అప్పగిస్తున్నారు. "UGC NET అప్‌డేట్:- కొత్త పరీక్ష తొందరలోనే నిర్వహిస్తాం,దానికి సంబందించిన సమాచారం త్వరలోనే తెలియజేస్తాము. ఈ కేసును సమగ్ర దర్యాప్తు కోసం CBIకి అప్పగిస్తున్నాము" అని NTA ట్విట్టర్‌లో రాసింది. ఈసారి, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NET) ఒకే రోజున పెన్, పేపర్ విధానంలో నిర్వహించారు. జూన్ 18, రికార్డు స్థాయిలో 11 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు నమోదు చేసుకున్నారు.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చేసిన ట్వీట్
మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్‌లో అవకతవకలు
UGC-NET అనేది భారతీయ విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్,అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియామకం,PhDలో ప్రవేశానికి భారతీయ పౌరుల అర్హతను నిర్ణయించడానికి జరిపే ఒక పరీక్ష. యుజిసి-నెట్ పరీక్షను రద్దు చేయాలని బుధవారం కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆదేశించింది.ఈ పరీక్షకు సంబందించిన పేపర్ లీక్ అయ్యినట్లు ఓ నివేదిక పేర్కొంది. అనంతరం కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించారు. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉన్న మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్‌లో అవకతవకలు జరిగాయన్న పెద్ద వివాదం నేపథ్యంలో మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. బీహార్ వంటి రాష్ట్రాల్లో ప్రతిష్టాత్మక పరీక్షలో ప్రశ్నపత్రం లీక్,ఇతరత్రా అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై పలు నగరాల్లో నిరసనలు వెల్లువెత్తడంతో పాటు పలు హైకోర్టులు,సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.