తదుపరి వార్తా కథనం
UGC NET Results out: యూజీసీ-నెట్ ఫలితాలు విడుదల - అర్హత సాధించిన అభ్యర్థుల సంఖ్య ఎంతో తెలుసా?
వ్రాసిన వారు
Jayachandra Akuri
Feb 23, 2025
10:52 am
ఈ వార్తాకథనం ఏంటి
యూజీసీ-నెట్ డిసెంబర్ 2024 ఫలితాలు విడుదలయ్యాయి.
జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హత సాధించేందుకు నిర్వహించిన ఈ పరీక్షను జనవరి 3, 6, 7, 8, 9, 10, 16, 21, 27 తేదీల్లో నిర్వహించిన విషయం తెలిసిందే.
ఇటీవల ప్రాథమిక కీ విడుదల చేసిన ఎన్‌టీఏ, అభ్యంతరాలను ఫిబ్రవరి 3 వరకు స్వీకరించిన తర్వాత తాజాగా ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది.
Details
స్కోర్ కార్డు కోసం క్లిక్ చేయండి
ఈ పరీక్షకు 8.49 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, దాదాపు 6.49 లక్షల మంది హాజరయ్యారు.
వారిలో జెఆర్ఎఫ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ కోసం 5,158 మంది, అసిస్టెంట్ ప్రొఫెసర్, పీహెచ్‌డీ అడ్మిషన్ కోసం 48,161 మంది, కేవలం PhD కోసం 1,14,445 మంది అర్హత సాధించారు.