Page Loader
Aadhaar: ఆన్‌లైన్లో ఆధార్ ఆప్డేట్ మూడు నెలలు ఫ్రీ
ఆధార్ వినియోగదారులకు కేంద్రం గుడ్‌న్యూస్

Aadhaar: ఆన్‌లైన్లో ఆధార్ ఆప్డేట్ మూడు నెలలు ఫ్రీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 16, 2023
10:01 am

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని భారత్ విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ ఆధార్ కార్డు వినియోగిస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పింది. ఆధార్‌ను మూడు నెలల పాటు అంటే ఈ ఏడాది జూన్‌ 14 వరకు ఆన్‌లైన్‌లో ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చని బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఇందులో మరోక నిబంధనను విధించింది. ఇది ఆధార్ పోర్టల్‌లో సొంతంగా చేసుకొనే వారికి మాత్రమే వర్తిస్తుందని వెల్లడించింది. ఆధార్ సేవా కేంద్రాల్లో మాత్రం ఈ సేవలకు గానూ రూ.50 వసూలు చేస్తారని వివరించింది. ఆధార్‌ సంఖ్య పొందినవారు ప్రతి పదేళ్లకోసారి సంబంధిత డాక్యుమెంట్లను అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

ఆధార్

కేంద్ర నిర్ణయంతో లక్షలాది మంది ప్రజలకు లబ్ధి

ఆధార్ జారీ అయ్యి పదేళ్లు పూర్తియిన వారు ఆధార్ అప్డేట్ చేసుకొనే అవకాశాన్ని యూఐడీఏఐ కల్పించింది. గతంలో ఆధార్ పోర్టల్ ద్వారా ఇలా అప్డేట్ చేసుకోవాలంటే రూ.25 చెల్లించాల్సి ఉండేంది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో లక్షలమంది ప్రజలు లబ్ధి పొందే అవకాశం ఉంది. ఈ ఉచిత సేవలు 'మై ఆధార్' పోర్టల్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. పేరు, పుట్టినతేదీ, చిరునామా వంటి మార్పులు చేర్పులకు సాధారణ చార్జీలు వర్తించనున్నాయి.