Page Loader
ఉమేష్ పాల్ కేసు: అతిక్ అహ్మద్ ఇంట్లో ఐఫోన్, ఆధార్ కార్డులు స్వాధీనం
ఉమేష్ పాల్ కేసు: అతిక్ అహ్మద్ ఇంట్లో ఐఫోన్, ఆధార్ కార్డులు స్వాధీనం

ఉమేష్ పాల్ కేసు: అతిక్ అహ్మద్ ఇంట్లో ఐఫోన్, ఆధార్ కార్డులు స్వాధీనం

వ్రాసిన వారు Stalin
Apr 05, 2023
11:17 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉమేష్ పాల్ హత్య కేసులో ప్రయాగ్‌రాజ్ పోలీసులు కీలకమైన పురోగతిని సాధించారు. గ్యాంగ్‌స్టర్‌ అతిక్ అహ్మద్ కసరి మసారి ఇంటి నుంచి ఒక ఐఫోన్, కీలకమైన రిజిస్టర్‌తో పాటు రెండు ఆధార్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. అతిక్‌తో పాటు పోలీసులు కస్టడీలోకి తీసుకున్న అతిక్ అకౌంటెంట్ రాకేష్ లాలా వాంగ్మూలం మేరకు పోలీసులు ఈ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ప్రయాగ్‌రాజ్‌లోని ధూమన్‌గంజ్ పోలీసులు అతిక్ అకౌంటెంట్ రాకేష్ లాలాతో సహా ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

ఉత్తర్‌ప్రదేశ్

రిజిస్టర్‌లో కీలకమైన ఆస్తి లావాదేవీల వివరాలు

స్వాధీనం చేసుకున్న ఐఫోన్ ఉమేషా పాల్ హత్యకేసులో ఉపయోగించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే ఆ ఫోన్ ను పరీక్ష కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపనున్నారు. అతిక్ అహ్మద్ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న పాత రిజిస్టర్‌లో అనేక మంది ప్రాపర్టీ డీలర్లు, అతిక్-అతని సహచరుల మధ్య జరిగిన ఆస్తి లావాదేవీల గురించిన సమాచారం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.. అతిక్ అహ్మద్‌కు చెందిన పలువురు పాత సహచరుల పేర్లు కూడా రిజిస్టర్‌లో ప్రస్తావించడం గమనార్హం. గ్యాంగ్‌స్టర్‌ అతిక్ అహ్మద్‌తో పాటు మరో ఇద్దరు నిందితులను 2006లో బీఎస్పీ ఎమ్మెల్యే రాజుపాల్ హత్య కేసులో ప్రధాన సాక్షి ఉమేష్ పాల్ కిడ్నాప్‌లో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లోని న్యాయస్థానం దోషులుగా నిర్ధారించింది.