Page Loader
ఉమేష్ పాల్ హత్య కేసు నిందితులకు నేపాల్‌లో ఆశ్రయం; అండర్ వరల్డ్‌ నాయకుడు అన్సారీ  అరెస్టు
ఉమేష్‌పాల్ హత్య కేసు నిందితులకు నేపాల్‌లో ఆశ్రయం

ఉమేష్ పాల్ హత్య కేసు నిందితులకు నేపాల్‌లో ఆశ్రయం; అండర్ వరల్డ్‌ నాయకుడు అన్సారీ అరెస్టు

వ్రాసిన వారు Stalin
Mar 17, 2023
09:43 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తరప్రదేశ్‌లో ప్రయాగ్‌రాజ్‌కు చెందిన ఉమేష్ పాల్ హత్య కేసు వ్యవహారం దేశం దాటి అంతర్జాతీయ స్థాయికి చేరింది. ఈ కేసులోని నిందుతులకు నేపాల్‌లో ఖయ్యూమ్ అన్సారీ అనే వ్యక్తి ఆశ్రయం ఇచ్చినట్లు ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) గుర్తించింది. ఖయ్యూమ్ అన్సారీకి అండర్ వరల్డ్‌‌తో సంబంధాలు ఉన్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఉమేష్ పాల్ హత్య కేసులో నిందితులైన అసద్, మహ్మద్ గులాంలకు ఖయ్యూమ్ అన్సారీ కారు, వసతి కల్పించినట్లు పోలీసులు గుర్తించారు. ఉమేష్ పాల్ హత్య చేసిన తర్వాత అసద్, మహ్మద్ గులాం ఇద్దరూ నేపాల్ వైపు వెళ్లినట్లు పోలీసులు సమాచారం అందుకున్నారు. ఆ దిశగా విచారణ చేపట్టారు.

ఉత్తర్‌ప్రదేశ్

అతిక్ అహ్మద్‌ సన్నిహితుడు వహీద్ అరెస్టు

ఉత్తరప్రదేశ్‌లోని బెహ్రాయిచ్ మీదుగా నేపాల్ దాటిన తర్వాత ఖయ్యూమ్ అన్సారీ వారికి సహాయం చేసినట్లు సమాచారం. అన్సారీకి అండర్ వరల్డ్ సంబంధాలు ఉన్నాయని, ఇతర కేసులకు సంబంధించి గతంలో ఎస్టీఎఫ్ అతడిని ప్రశ్నించిందని పోలీసు వర్గాలు తెలిపాయి. ఉమేష్ పాల్ గత నాలుగేళ్లుగా గ్యాంగ్‌స్టర్‌గా మారిన రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్‌ని లక్ష్యంగా చేసుకున్నాడు. ఉమేష్ పాల్ హత్య కలకలం రేపుతుందని అతనికి తెలుసు, వర్గాలు తెలిపాయి. ఇదిలావుండగా, అనేక క్రిమినల్ కేసుల్లో వాంటెడ్‌గా ఉన్న అతిక్ అహ్మద్‌కు సన్నిహితుడు అని చెప్పుకునే వహీద్ అహ్మద్‌ని గురువారం బండాలోని మతౌండ్ ప్రాంతంలో పోలీసులు అరెస్టు చేశారు. వహీద్ అరెస్టు సమంయలో పోలీసులు- వహీద్ మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో వహీద్ గాయపడ్డారు.

మీరు
100%
శాతం పూర్తి చేశారు