Page Loader
ఉమేష్ పాల్ హత్య: పోలీసుల అదుపులో అతిక్ అహ్మద్ సన్నిహితుడు బల్లి పండిట్
పోలీసుల అదుపులో అతిక్ అహ్మద్ సన్నిహితుడు బల్లి పండిట్

ఉమేష్ పాల్ హత్య: పోలీసుల అదుపులో అతిక్ అహ్మద్ సన్నిహితుడు బల్లి పండిట్

వ్రాసిన వారు Stalin
Mar 13, 2023
01:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉమేష్ పాల్ హత్య కేసులో ఉత్తరప్రదేశ్ పోలీసులు పురోగతి సాధించారు. హత్య కేసులో ప్రధాన నిందితుడు, గ్యాంగ్‌స్టర్‌‌గా, రాజకీయ నాయకుడిగా చలామణి అవుతున్న అతిక్ అహ్మద్‌కు సన్నిహితుడైన బల్లి పండిట్‌ను పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల అహ్మద్ భార్యను బల్లి పండిట్‌ కలిసినట్లు సీసీటీవీ పుటేజీలు లభించాయి. దీంతో అప్పటి నుంచి బల్లి పండిట్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఫిబ్రవరి 24న, ఉమేష్ పాల్ తన ఎస్‌యూవీలో ఇంట్లో నుంచి బయటికి వస్తున్న క్రమంలో అతని నివాసం వెలుపల పట్టపగలు కాల్చి చంపారు.

యూపీ

పాల్ హత్య కేసులో ప్రతి నిందితుడిపై రూ.2.5 లక్షల రివార్డు

2004లో అలహాబాద్ వెస్ట్ రాజు పాల్ బీఎస్పీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. అప్పడు సమాజ్‌వాద్ పార్టీలో ఉన్న అహ్మద్ తన పార్టీ ఓటమిని జీర్ణించుకోలేకపోయారు. దీంతో ఎన్నికల ఓటమికి ప్రతీకారం తీర్చుకునేందుకు రాజు పాల్‌ను 2005లో అహ్మద్ హత్య చేయించినట్లు పోలీసుల అభియోగాలు మోపారు. ఈ కేసులో ప్రధాన సాక్షిగా ఉమేష్ పాల్ ఉన్నారు. ఉమేష్ పాల్ హత్య వ్యవహారం ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎస్పీ- బీజేపీ మధ్య రాజకీయ వైరానికి దారితీసింది. హత్య కేసులో నిందితులకు ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆశ్రయం కల్పించారని ఆరోపించారు. పాల్ హత్య కేసులో ప్రతి నిందితుడిపై పోలీసులు రూ.2.5 లక్షల రివార్డును ప్రకటించారు.