LOADING...
Budget 2026: కేంద్రం బాలికల విద్యకు పెద్ద మద్దతు: ప్రతి జిల్లాలో హాస్టల్‌లు
కేంద్రం బాలికల విద్యకు పెద్ద మద్దతు: ప్రతి జిల్లాలో హాస్టల్‌లు

Budget 2026: కేంద్రం బాలికల విద్యకు పెద్ద మద్దతు: ప్రతి జిల్లాలో హాస్టల్‌లు

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 01, 2026
12:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలికల విద్యను ప్రోత్సహించడం కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా భావిస్తున్నది. ఈ అంశాన్ని బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రత్యేకంగా స్పష్టం చేశారు. దేశంలోని ప్రతి జిల్లాలో బాలికల కోసం హాస్టల్స్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. బాలికల విద్యకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె తెలిపారు. అంతేకాదు, సంప్రదాయ వైద్య పరిశోధనను అభివృద్ధి చేయడానికి జామ్‌నగర్‌లో పరిశోధన కేంద్రం ఏర్పాటుచేయనున్నట్లు నిర్మలమ్మ తెలిపారు. అలాగే, మూడు కొత్త ఆయుర్వేద ఆస్పత్రులను కూడా ఏర్పాటు చేస్తారని తెలిపారు. ఆతిథ్య రంగంలో జాతీయ సంస్థను స్థాపించనున్నట్లు, 20 పర్యాటక కేంద్రాల్లో పదివేల మంది గైడ్‌లను నియమించనున్నట్లు మంత్రి వివరించారు.

Advertisement