Telangana: తెలంగాణకు కేంద్ర క్యాబినెట్ గుడ్‌న్యూస్.. రెండు జాతీయ రహదారుల విస్తరణకు గ్రీన్‌సిగ్నల్
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ, ఒడిశా, బిహార్ రాష్ట్రాల్లో జాతీయ రహదారుల విస్తరణతో పాటు కొత్త రహదారుల నిర్మాణానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. తెలంగాణకు సంబంధించి ఆర్మూర్-జగిత్యాల-మంచిర్యాల జాతీయ రహదారి (ఎన్‌హెచ్-63) విస్తరణకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టును హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హెచ్‌ఏఎం) విధానంలో చేపట్టేందుకు అంగీకరించింది.
వివరాలు
190 కిలోమీటర్ల మేర నాలుగు లేన్లుగా రెండు జాతీయ రహదారులు
అలాగే జగిత్యాల-కరీంనగర్ జాతీయ రహదారి (ఎన్‌హెచ్-563) విస్తరణకు కూడా కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పనులను బిల్డ్-ఆపరేట్-ట్రాన్స్‌ఫర్ (బీవోటీ) విధానంలో అమలు చేయనున్నట్లు వెల్లడించింది. ఈ రెండు జాతీయ రహదారులను కలిపి సుమారు 190 కిలోమీటర్ల మేర నాలుగు లేన్లుగా విస్తరించనున్నారు. ఇందుకోసం రూ.7,597 కోట్ల వ్యయాన్ని కేంద్రం అంచనా వేసింది. ఈ ప్రాజెక్టులు పూర్తయితే రాష్ట్రంలో రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు ప్రయాణ సమయం తగ్గి, వాణిజ్య కార్యకలాపాలకు కూడా ఊతం లభించే అవకాశం ఉంది.