LOADING...
Elections: జమిలి ఎన్నికలకు కేంద్ర క్యాబినేట్ గ్రీన్ సిగ్నల్
జమిలి ఎన్నికలకు కేంద్ర క్యాబినేట్ గ్రీన్ సిగ్నల్

Elections: జమిలి ఎన్నికలకు కేంద్ర క్యాబినేట్ గ్రీన్ సిగ్నల్

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 18, 2024
03:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

వన్ నేషన్-వన్ ఎలక్షన్( జమిలి ఎన్నికలు)కు కేంద్ర క్యాబినేట్ ఆమోదం తెలిపింది. రామ్‌నాథ్ కోవింద్ ప్యానల్ ఈ నివేదికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఇక ఇది చట్టంగా మారితే లోక్ సభ, అసెంబ్లీ, స్థానిక ఎన్నికలకు వంద రోజుల వ్యవధిలో ఏకకాలంలో నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నిర్ణయంతో ప్రజాధనం ఆదా కావడంతో పాటు ప్రభుత్వాలు వేగంగా నిర్ణయాలు తీసుకునేందుకు వీలవుతుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

దేశంలో జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం 

Details

ఒకే దేశం, ఒకే ఎన్నికలకు సంపూర్ణ మద్దతు

సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులతో సహా 32 మంది ప్రముఖ న్యాయ నిపుణులు "ఒకే దేశం, ఒకే ఎన్నికలు" విధానానికి సంపూర్ణ మద్దతును ప్రకటించారు. కేబినెట్ కూడా ఇటీవలే చంద్రయాన్‌-4, గగన్‌యాన్‌, చంద్రయాన్‌ విస్తరణ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఈ కార్యక్రమాలతో పాటు, జమిలి ఎన్నికల ప్యానల్ సిఫార్సులు కూడా చర్చకు వచ్చాయి. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ, పంచాయతీలకు మూడు స్థాయిల్లో ఎన్నికలు జరగడం వలస కార్మికులకు తీవ్ర ఇబ్బందులు కలిగాయి. ఇక అన్ని స్థాయిల ఎన్నికలను ఒకేసారి ఎన్నికలు జరపడం ద్వారా ఉత్పత్తి, పనితీరు మెరుగవుతుందని ప్యానల్ పేర్కొంది.

Details

15 పార్టీలు వ్యతిరేకం

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవల జమిలి ఎన్నికలను అమలుచేయడం తమ ప్రథమ ప్రాధాన్యమని ప్రకటించారు. ప్రధాని మోదీ కూడా గత నెల స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ఈ విధానాన్ని ప్రస్తావించారు. అయితే, ఈ ప్రతిపాదనకు కాంగ్రెస్ సహా 15 పార్టీలు వ్యతిరేకంగా స్పందించాయి. కాంగ్రెస్ అధినేత మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ ఈ ప్రతిపాదన ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం మాత్రమే. ఇది ఆచరణాత్మకం కాదన్నారు.