
Central Cabinet Meeting: నేడు కేంద్ర కేబినెట్ సమావేశం.. పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..
ఈ వార్తాకథనం ఏంటి
నేడు కేంద్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈరోజు (బుధవారం) ఉదయం 10:30 గంటలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరుగనుంది.
ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రత్యేకంగా, జమిలీ ఎన్నికలపై కూడా చర్చించే అవకాశముంది.
దసరా, దీపావళి పండగలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు పలు ప్రయోజనాలు ప్రకటించే అవకాశం కూడా ఉన్నట్టు సమాచారం.
వివరాలు
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం భారత ప్రజాస్వామ్యానికి విజయ సూచిక: మోదీ
ఇక హర్యానాలో హ్యాట్రిక్ విజయం సాధించిన అనంతరం, ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో విజయోత్సవ సభను నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం భారత ప్రజాస్వామ్యానికి విజయ సూచిక అని పేర్కొన్నారు.
హర్యానా రైతులు భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తున్నారని నిరూపితమైందన్నారు.
హర్యానాలో కమలం మూడో సారి కూడా వికసించిందని చెప్పారు.
జమ్మూ కాశ్మీర్‌లో ఎన్సీ-కాంగ్రెస్ కూటమి ఎక్కువ స్థానాలు గెలిచినప్పటికీ, బీజేపీ గతం కంటే అధిక ఓట్లు సాధించిందని ప్రధాని మోదీ వెల్లడించారు.