Page Loader
అమృత్ కాల్‌ను విజయవంతం చేయాలి, ఐపీఎస్‌ పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌లో అమిత్‌ షా
ఆ 3 చట్టాలకు త్వరలోనే ఆమోదం

అమృత్ కాల్‌ను విజయవంతం చేయాలి, ఐపీఎస్‌ పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌లో అమిత్‌ షా

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Oct 27, 2023
11:30 am

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌ రాజేంద్రనగర్ లోని సర్దార్ వల్లాభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ (SVPNPA)లో ఐపీఎస్‌ ప్రొబేషనర్ల 75వ బ్యాచ్‌ పాసింగ్‌-అవుట్‌ పరేడ్‌ జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా హాజరయ్యారు. వచ్చే 25 ఏళ్లు (అమృత్‌ కాల్‌) విజయవంతం చేయాలని, ఈ కాలంలోనే దేశాన్ని తీర్చిదిద్దాలని సూచించారు. ప్రతి రంగంలోనూ తొలి స్థానానికి చేరుకుని, దేశాన్ని ఉన్నత స్థానంలో నిలబెట్టాలని హితబోధ చేశారు. అమృత్‌కాల్‌లో భాగంగా రానున్న 25 ఏళ్లలో భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారి, ప్రతి రంగంలో ప్రపంచాన్ని నడిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు భారత్‌లో అత్యంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్న పోలీసు దళం ఉంటుందని స్పష్టం చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

భారత్‌లో అత్యంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్న పోలీసు దళం ఉంది : అమిత్ షా